అనువాదలహరి

ఒక్కోసారి అలా జరుగుతుంది… బ్రయన్ పాటెన్, ఇంగ్లీషు కవి

ఒక్కోసారి నువ్వు మంచి మిత్రుడవవుతావు

తర్వాత అవకుండా పోతావు,

స్నేహ వాంఛ అలా గడిచిపోతుంది.

ఆ ఆలోచనలో రోజులు దొర్లిపోతాయి

ఈలోపు ఒక నీటిబుగ్గ ఎండిపోతుంది.

ఒక్కోసారి  నువ్వంటే ఇష్టపడతారు, తర్వాత

నీమీద ఇష్టం తగ్గిపోతుంది.

ఇష్టం కాలగర్భంలో కలిసిపోతుంది.

అందులో కొన్ని రోజులు అలా దొర్లిపోతాయి.

ఈ లోగా ఒక చెలమ గడ్డిలోకి ఇంకిపోతుంది.

ఒకోసారి నువ్వామెతో మాటాడదామనుకుంటావు, తర్వాత

ఇప్పుడు మాటాడొద్దులే అనుకుంటావు.

ఈ లోపు మాటాడే అవకాశం జారిపోతుంది.

నీ కలలు ఒక్క సారిగా వెలిగి, బుస్సున మటుమాయమౌతాయి.

ఒకోసారి ఎటూ పోడానికి తోవ కవిపించదు, అంతలోనే

ఏదో దారి కనిపిస్తుంటుంది.

కాని నువ్వు దాన్ని దాటి వెళిపోతావు.

ఒక నిమిషం కంటే కూడా త్వరగా

సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతాయి.

చివరకి నీకు ఏమీ మిగలదు.

నీకు ఆశ్చర్యం వేస్తుంది వీటిని పట్టించుకోనవసరమా అని.

నువ్వు వీటిని పట్టించుకోవలసిందేమో అని అనుకుంటుండగానే

అవి వాటి విలువని కోల్పోతాయి.

పట్టించుకోవడం గతమైపోతుంది.

ఈలోపు ఒక చెలమ మట్టిలో ఇంకిపోతుంది. 

.

బ్రయన్ పాటెన్

(7 February 1946)

ఇంగ్లీషు కవి

.

Sometimes it Happens

.

And sometimes it happens that you are friends and then

You are not friends,

And friendship has passed.

And whole days are lost and among them

A fountain empties itself.

 

And sometimes it happens that you are loved and then

You are not loved,

And love is past.

And whole days are lost and among them

A fountain empties itself into the grass.

 

And sometimes you want to speak to her and then

You do not want to speak,

Then the opportunity has passed.

Your dreams flare up, they suddenly vanish.

 

And also it happens that there is nowhere to go and then

There is somewhere to go,

Then you have bypassed.

And the years flare up and are gone,

Quicker than a minute.

 

So you have nothing.

You wonder if these things matter and then

As soon you begin to wonder if these things matter

They cease to matter,

And caring is past.

And a fountain empties itself into the grass.

 

Brian Patten

7 February 1946

English Poet

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2002/09/sometimes-it-happens-brian-patten.html

 

%d bloggers like this: