… From being Repressed and vanquished… Mercy Margaret , Telugu, Indian
Yester night
I overheard the distressing calls of the wind.
Spanning their hands,
When Trees tried to repress the air
Making fetters of their branches and leaves
I heard
The Wind cry in distress
For liberty.
With unrestrained rage and anger
When trees overpowered it
I heard the distressing calls of the wind
Breathing its last fighting
To wriggle out of the throes in search of freedom.
And lo! When I watched first thing in the morning
There lay strewn ruins evenly
With the heckling leaves perforated
And the new-born flowers biting the dirt.
Even though the rain rolled over them
The trees were standing tall and firm
Rejoicing in cryptic smiles.
Yet,
The wind
Like a vanquished soldier in the war
Was lying in state subdued amidst trees
With fond hopes for a future victory.
Somehow,
The tamed wind
Lying at the feet of the trees
Seemed the psalm of my ancestors
Waiting for liberty.
.
Mercy Margaret
Telugu
Indian
.

B Mercy Margaret
.
అణచివేయబడ్డానికి జయించబడ్డానికి మధ్య
.
నిన్నటి రాత్రి
గాలి చేసిన ఆర్తనాదాలు విన్నాను
తనని తాను విముక్తి చేసుకోడానికి
చేతులని వ్యాప్తి చేసి
శాఖలు ఇంకా ఆకులు వెళ్ళనివ్వకుండా
చెట్లు వేసిన సంకెళ్ళను విడగొట్టుకోవడానికి
నిన్నటి రాత్రి
స్వేచ్చకోసం
గాలి చేసిన ఆర్తనాదాలు విన్నాను
ఆపుకోలేని ఆగ్రహావేశాలతో
కాళ్లు చేతులు దేహం మొత్తం ఆక్రమింపబడ్డ
ఆ వృక్షపు అధికార బలప్రయోగం నుండి
విమోచింపబడడానికి
స్వేఛ్చాపోరాటం చేసి ప్రాణాలొదిలిన
గాలి చేసిన ఆర్తనాదాలు విన్నాను.
ఈ ఉదయం కళ్ళు తెరిచి చూద్దును కదా
చెల్లాచెదురుగా పడిఉన్న శిథిలాలు
గేలిగా నవ్విన ఆకులపై కన్నాలు పడి
కొత్తగా జన్మించినపూలు అప్పుడే నేలరాలి
వర్షంతో తొక్కించబడినా
చెట్లు కదలకుండా స్థిరంగా నిల్చుని
సైగలతో నవ్వుకుంటున్నాయి
కాని
గాలి మాత్రం
యుద్ధంలో పరాజయం పొందిన సైనికుడిలా
అణచివేయబడి అక్కడే చెట్ల మధ్య
ఏదో ఒకరోజు తప్పక జయిస్తానని ఎదురుచూస్తున్నట్టుంది
ఎందుకో ఆ గాలి
స్వేచ్చకోసం
నా పూర్వికులు చేసిన ప్రార్ధనై
అక్కడ చెట్టు మూలాల్లో ఇంకా విడుదలకోసం
ఎదురుచూస్తున్నట్టుంది
.
మెర్సీ మార్గరెట్
తెలుగు