అనువాదలహరి

సైకిలుమీద కొండ దిగుడు… హెన్రీ ఛార్లెస్ బీచింగ్, ఇంగ్లీషు కవి

కాళ్ళు పైకెత్తి, చేతులు నిలకడగా పట్టి,
నేను కొండ దిగడానికి సిద్ధంగా ఉన్నాను.
బాణంలా, జాగ్రత్తగా మనసుపట్టి నడుపుతుంటే
గాలి పక్కనుండి సర్రున పోతోంది.

జోరుగా, ఇంకా జోరుగా,
గుండే ఒక్కసారి ఎవరో పైకెత్తేసినట్టు,
మనసునవ్వులో తేలుతోంది, గొంతు అరుపులతో,
“ఓ పక్షిరాజమా, చూడు, చూడు, నేనూ ఎగురుతున్నా.

ఇదేనా, ఇదేనా నీ ఆనందహేతువు?
అలా అయితే, ఓ విహంగమా నేను కుర్రాణ్ణయినా
ఒక అద్భుతమైన క్షణం పాటు
నీలా గాలిలో నేనూ తేలిపోయాను.

ఓ హృదయమా! ఏదీ చెప్పు, సృష్టిలో దీన్ని
మించిన బ్రహ్మానందం మరోటుందేమో?
ఇది స్కేటింగు కంటే కూడా మిన్న,
నేలమట్టానికి ఉక్కుతో అతకబడి ఉంటుంది

జోరు నెమ్మదిగా తగ్గుతోంది,
నేను నా గాలిపడవలో కాసేపు తేలియాడతాను
ఇక చక్రాలు తిరగడం మానేసి,
నేను పెడలుమీంచి కాళ్ళు తీసి నేలకి ఆన్చేదాకా.

చిత్రం! ఇంత ఎత్తైన కొండా
చివరకి ఒక లోయలోకి ముగుస్తోంది. అయితేనేం,
ఎవడు కష్టపడి పైకి ఎక్కుతాడో,
వాడికోసం రెక్కలు సిద్ధంగా ఎదురుచూస్తుంటాయి.

.

హెన్రీ ఛార్లెస్ బీచింగ్

15 May 1859 – 1919

ఇంగ్లీషు కవి.

.

.

 

Going down Hill on a Bicycle

(A BOY’S SONG)

.

With lifted feet, hands still,  

I am poised, and down the hill

Dart, with heedful mind;        

The air goes by in a wind.      

 

Swifter and yet more swift,             

Till the heart with a mighty lift        

Makes the lungs laugh, the throat cry:—   

‘O bird, see; see, bird, I fly.     

 

‘Is this, is this your joy?

O bird, then I, though a boy   

For a golden moment share    

Your feathery life in air!’      

  

Say, heart, is there aught like this    

In a world that is full of bliss?

‘Tis more than skating, bound

Steel-shod to the level ground.

 

Speed slackens now, I float    

Awhile in my airy boat;

Till, when the wheels scarce crawl,  

My feet to the treadles fall.    

 

Alas, that the longest hill        

Must end in a vale; but still,   

Who climbs with toil, wheresoe’er,  

Shall find wings waiting there.

.

Henry Charles Beeching.

15 May 1859 – 1919

English Clergyman and Poet

 

 

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/856.html

 

 

%d bloggers like this: