అనువాదలహరి

డాడాయిస్ట్ కవిత రాయడం ఎలా?… ట్రిస్టన్ జారా, రుమేనియన్ కవి

(18 వ శతాబ్దపు చివర ప్రారంభమై 19 వశతాబ్దపు మొదటిసగం బహుళప్రచారంలో ఉన్న కాల్పనిక వాదానికి (Romanticism) తిరుగుబాటుగా యూరోపులో వచ్చిన ఉద్యమం డాడాయిజం. దానికి ఆద్యుడు ట్రిస్టన్ జారా.  పైకి ఒక వరసా, వాడీ, అర్థం పర్థం లేని కవిత్వం రాయడంగా కనిపించినప్పటికీ, దీనిలో ఒక మౌలికమైన భావన ఉంది: అది, కవిత్వం అన్నది మనం ఎలా యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి వచ్చేమో, అంతే యాదృచ్ఛికంగా కవిత వస్తుంది తప్ప, “పనిగట్టుకుని రాసేది కవిత్వం కా”దని ఈ ఉద్యమకారుల భావన.  బెర్ట్రండ్ రస్సెల్  వేరే సందర్భంలో చెప్పినప్పటికీ, ఇక్కడ ఒక విషయం చెప్పకతప్పదు. “ఒక టైపు మిషను మీద ఒక కోతిని వదిలెస్తే, అది అలా టైపు చేసుకుంటూ పోతే, ఈ విశ్వ సాహిత్యంలో వచ్చిన అపూర్వమైన కవిత్వం అంతా అది టైపు చెయ్యగలదు.”  అది అసంబద్ధం కాదు.)

ఒక వార్తా పత్రిక తీసుకో.

ఒక కత్తెర తీసుకో.

నీకు ఎంత నిడివి కవిత కావాలనుకుంటున్నావో

అంత నిడివిగల వ్యాసం పత్రికలోంచి ఎంచుకో.

దాన్ని పూర్తిగా కత్తిరించి బయటకి తియ్యి.

తర్వాత వ్యాసంలోని మాటలు ఒకదానితర్వాత ఒకటి వరసగా

జాగ్రత్తగా కత్తిరించి ఒక సంచిలో వెయ్యి.

నెమ్మదిగా గిలకరించు.

తర్వాత సంచిలోంచి ఒక్కొక్క మాటా పైకి తియ్యి.

ఏ వరసలో మాటలు సంచిలోంచి పైకి తీసేవో ఆవరుసలో పేర్చు.

ఆ కవిత అచ్చం నిన్ను పోలి ఉంటుంది.

శబాష్!

మిగతా పామర జనం మెచ్చకపోతే పోనీ, ఇప్పుడు నువ్వు

కవిత్వరహస్యం తెలిసిన, వేలరెట్లు సహజ ప్రజ్ఞగల కవివి.

.

ట్రిస్టన్ జారా.

April 16, 1896 – December 25, 1963

రుమేనియన్ కవి

 Tristan Tzara

 

.

 

To Make a Dadaist Poem

.

Take a newspaper

Take some scissors.

Choose from this paper an article the length

you want to make your poem.

Cut out the article.

Next carefully cut out each of the words

that make up this article and put them all in a bag.

Shake gently.

Next take out each cutting one after the other.

Copy conscientiously in the order in which they left the bag.

The poem will resemble you.

And there you are–

an infinitely original author of charming sensibility,

even though unappreciated by the vulgar herd.

.

Tristan Tzara (Samuel Rosenstock)

April 16, 1896 – December 25, 1963

Romanian Poet

 

%d bloggers like this: