నెల: అక్టోబర్ 2014
-
చాప్మన్ కళ్ళతో హోమరును చూసినపుడు … కీట్స్, ఇంగ్లీషు కవి
(కీట్స్ 220 వ జయంతి సందర్భంగా నివాళి) . ఎంతోమంది కనకమణిమయములైన దేశాలు తిరిగి, గొప్ప సామ్రాజ్యాలనీ, మహానగరాలనీ చూసి ఉండొచ్చు; నేనుకూడా కవులు సూర్యుడికి సవినయంగా మొక్కులు చెల్లించే దాపటి ద్వీపాలనెన్నో దర్శించాను. వాటిలో ఒక సువిశాలమైన ద్వీపాన్ని గభీరమైన నుదురుగల హోమరు స్వంతం చేసుకున్నాడు; కానీ, చాప్మన్ స్పష్టంగా, విశదంగా చెప్పేదాకా అందులోని స్వారస్యాన్ని ఆస్వాదించలేకపోయాను. మొదటిసారి తన వీక్షణాపరిథిలోకి ఒక కొత్తగ్రహం వచ్చినపుడు రోదసివీక్షకుడుపొందే అనుభూతి చెందాను. డేరియన్ శిఖరాగ్రం నుండి డేగకన్నులతో…
-
మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు సంగీతం, జ్ఞాపకాలలో నినదిస్తుంది. కమ్మని పూవులు వాడిపోయినా, వాటి నెత్తావి, మేల్కొలిపిన ఇంద్రియంలో పదిలం. గులాబి రేకులు, గులాబి రాలిపోయినా, ప్రియుల సమాధులపై పోగుబడతాయి. అలాగే నువ్వు లేకున్నా, నీ గూర్చిన ఆలోచనలూను; ప్రేమ ఎప్పుడూ నివురుగప్పి ఉంటుంది. . షెల్లీ 4 August 1792 – 8 July 1822 ఇంగ్లీషు కవి. . . Music, when Soft Voices die . Music, when soft voices die,…
-
పాపం! క్లియోపాత్రా!… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
అతి నేర్పుగల చేతులు పూతపూసి పదిలపరచగా పాపం! జడమైన క్లియోపాత్రా గాజు గాజు పెట్టెలో నిద్రిస్తోంది. ఆమె మెడకి వాళ్ళొక మేలిమి కంఠహారం తగిలించేరు ఆమె పాద రక్షలు, ఎడారిలో అరిగిపోయాయని ప్రతీతి. వాడి చూపులుగల ఈ దక్షిణాది యువరాణి క్లియోపాత్రా ఒకప్పుడు ఈజిప్టులో గొప్ప మన్ననలందుకుంది ఇప్పుడు ఆమె బాగా ముసలిదై, శుష్కించి, కళతప్పింది, ఆమె నోరు ఇప్పుడు నల్లని తారుతో మూసీసేరు. సమాధుల దొంగలు ఆమె చేతులనుండి బంగారు ఉంగరాలు లాగేసేరు. ఆమె గుండెపై…
-
మేఘాలూ- కెరటాలూ…. రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి
అమ్మా, అమ్మా! మేఘాల్లో ఉండేవాళ్ళు నన్ను పిలుస్తారే “మనం లేచిందగ్గరనుండి రోజు అంతమయ్యేదాకా ఆడుకుందాం బంగారు ప్రభాతంతో ఆడుకుందాం, వెన్నెలబిళ్ళ చంద్రుడితోనూ ఆడుకుందాం,”అని “మరి నేను అక్కడికి చేరేదెలా?” అని అడుగుతానే. వాళ్ళు, “భూమి అంచుదాకా రా, ఆకాశానికి చేతులు చాచు, నువ్వు వెంటనే మేఘాల్లోకి తీసుకుపోబడతావు,” అన్నారే. “అమ్మో! మా అమ్మ నాకోసం ఇంటిదగ్గర ఎదురు చూస్తుంటుంది. ఆమెను వదలి ఎలా రాను?” అని నే నన్నానే. అప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ తేలి పోయారే. అమ్మా,…
-
తన మృతిపై … వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
మృత్యువు నామీద నిలబడింది, వంగి, తలవాల్చి నా చెవిలో ఏదో గుసగుసలాడుతోంది; ఆ వింతభాష నాకు అర్థం కాలేదు గాని, తెలిసిందల్లా, ఇకపై భయపడనవసరం లేదని. . వాల్టర్ సావేజ్ లాండర్ 30 జనవరి- 1775 – 17 సెప్టెంబరు 1864 ఇంగ్లీషు కవి On His Own Death . Death stands above me, whispering low I know not what into my ear: Of his strange language all…
-
బాంబు వ్యాసం … యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
ఆ బాంబు వ్యాసం ముఫై సెంటిమీటర్లు, నలుగురు చనిపోయి, పదకొండుగురు గాయపడేలా దాని ప్రభావం కనిపించింది 7 మీటర్ల వ్యాసంలో. వాళ్ళ చుట్టూ … ఇంకా పెద్ద కాల వృత్తంలో బాధావృతమై రెండు ఆసుపత్రులు చెల్లాచెదరైపోయాయి ఒక శ్మశానం కూడా. కాని పాపం నగరంలో ఖననం చెయ్యబడ్డ యువతి వచ్చిన వందకిలోమీటర్లు పైబడిన దూరమూ కలుపుకుంటే ఆ వృత్తం ఇంకా పెద్దదవుతుంది. సముద్రాల్ని దాటి ఎక్కడో దూర దేశపు తీరాల్లో ఆమెకోశం శోకిస్తున్న ఒంటరి మనిషి దుఃఖం…
-
చివరి కవితలు… 12…. ఏ ఇ హౌజ్మన్, ఇంగ్లీషు కవి
దూరంగా పొద్దు కళ్ళు నులుపుకుంటోంది: సూర్యుడు ఉదయించేడు, నేనూ లేవాలి, కాలకృత్యాలు తీర్చుకుని, బట్టలేసుకుని, తిని, తాగి, ప్రపంచాన్ని పరిశీలించి, మాటాడి, ఆలోచించి, పనిచేసి… ఇవన్నీ ఎందుకుచేస్తున్నానో దేముడికెరుక. ఓహ్! ఎన్నిసార్లు స్నానంచేసి, బట్టలేసుకోలేదు! ఇంత శ్రమపడినందుకూ ఫలితం ఏమైనా ఉందా? హాయిగా పక్కమీద పడుకుని విశ్రాంతి తీసుకుంటాను: పది వేలసార్లు నా శక్తివంచనలేకుండా పనిచేశాను తిరిగి ప్రతీదీ మరోసారి చెయ్యడానికే. . ఏ ఇ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936…
-
When will you be back, Pa?… Dr. Pulipati Guruswamy, Telugu, Indian
బ్లాగు మిత్రులకీ, పాఠకులకీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాలలో కొత్తకాంతులు నింపుగాక! . “Where is your Pa? Where is your Pa, shorty?” They ask me everybody, Pa! The other day In pitch darkness Police caught Ma by her hair And abused her saying ‘You bitch, When will your man return?” Whenever my sib wails,…
-
నేనో అనామికని… మరి నీ సంగతి?… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నేనో అనామికని… మరి నీ సంగతి? నువ్వు కూడా… అనామికవేనా, ఆ? అలాగయితే మనిద్దరం జంట, సరేనా ? ష్! ఎవరికీ చెప్పకు! చెబితే దండోరా వేస్తారు. తెలుసుగా! ఎంత రసహీనం: ఏదో ఒకటవడం ! ఎంత బట్టబయలు… ఒక కప్పలాగ… మన పేరు చెప్పుకోవడం… జీవితం సాగదియ్యడం… బాడవ నేలలు మెచ్చుకుంటూండడం! . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి. . . I’m Nobody!…
-
జాలి… హెరాల్డ్ వినాల్, అమెరికన్ కవి
ఒక అందమైన వసంతవేళ వీధుల్ని చల్లని తెమ్మెర సంగీతంతో ముంచెత్తినపుడు మనసుపారేసుకున్నానని జాలిపడవద్దు; ఒకప్పుడు జ్వాలగా రగిలిన నీ ప్రేమని తిరస్కరించేనని నా మీద జాలిపడవద్దు, ఇప్పటికీ తాపంతో తపించే పువ్వు తన హృదయాన్ని తొలకరి చినుకులకి ఆర్తితో ఎదురుచూసినట్టు వీచే ప్రతిగాలికీ తనహృదయాన్ని ఆరబెట్టినట్టు … నా దప్పితీరలేదు. జాలిపడదలుచుకుంటే, రాబోయే క్షణాలకు జాలిపడు సుదూరభవిష్యత్తులో, ఏదో ఒక రోజు మళ్ళీ నేను ఈ త్రోవనే మన ఇంటి ముంగిట నిలవబోయినపుడు గుమ్మం నన్ను నా…