అప్పటికప్పుడు … పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియన్ కవి
ఫిడియాస్ సృష్టి
అప్పటికప్పుడు చేప
నీళ్ళలో వదలడమే ఆలస్యం
ఈదడం ప్రారంభిస్తుంది.
.
పీటర్ పోర్టర్
16 February 1929 – 23 April 2010
ఆస్ట్రేలియన్ కవి
(ఫిడియాస్ అన్న గ్రీకు శిల్పి శిల్పాలు ఎంత జీవకళ ఉట్టిపడేవంటే, అవి నిజమైనవేమోనన్న భ్రమ కల్పించేవట. ఇక్కడ మనం కావలస్తే బాపుగారిని ప్రతిక్షేపించుకోవచ్చు బాగా అర్థం అవడానికి. )
చూడడానికి ఈ కవితలో ఏముంది అనిపించవచ్చు. కేవలం శిల్పం గురించి చెప్పి ఉంటే, ఒక అతిశయోక్తి అలంకారం మినహా ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ ఉండదు.
కానీ, ఈ ఉపమానం వెనుక ఒక సందేశం కూడా ఉంది. మనం అక్షరాలా ఫిడియాస్ శిల్పాలవంటి వాళ్ళం. ఎంత గొప్ప ఆలోచనలూ ప్రణాళికలూ ఉంటే ఏమి లాభం. వాటిని ఆచరణలోకి అనువదించాలి.
జీవితంలోకి ఉరకాలి అంతే. అప్పుడు మనకి చైతన్యం వస్తుంది. లేకపోతే ఫొటోలోని బొమ్మకీ మనకీ తేడా ఏంటి?
Peter Porter
British Based Australian Poet