ప్రతి ఊరూ స్వంత ఊరే… తమిళ కవిత
ప్రతి ఊరూ స్వంత ఊరే
ప్రతి వ్యక్తి నాకు చుట్టమే.
మంచీ చెడూ
ఇవతలివాళ్ళ వల్ల కలగవు.
బాధా, నివారణా
వాటంతట అవే కలుగుతాయి.
చావు మనకి కొత్తకాదు.
‘జీవితం తీయన’ అని
పెద్దగా పండగ చేసుకోము.
అలాగే, కోపం వచ్చిందని
అది చేదని నిందించము.
మన జీవితాలు ఎంత ప్రియమైనవైనప్పటికీ
వాటి మార్గాన్ని అవి అనుసరిస్తాయి,
మెరుపులు ఛేదించిన ఆకాశం నుండి
కుంభవృష్టిగా కురిసిన వర్షానికి
వడిగా పారుతున్న మహానదుల్లో
మధ్యమధ్య తగిలే రాళ్ళకి కొట్టుకుని
దిశలు మర్చుకునే బల్లకట్లలా.
మనకి ఈ విషయం
దార్శనికుల
ముందుచూపు వల్ల తెలిసింది.
అందువల్ల
గొప్ప విషయాలకి ఆశ్చర్యపోయేదీ లేదు
చిన్నవాటిని మనం అనాదరణాచేసేదీ లేదు
.
(క్రీస్తు పూర్వము 2వ శతాబ్దపు ‘పురనానూరు’ తమిళ సంకలనం లోని ఈ Song of Kaniyan Punkunran కవిత శ్రీ AK రామానుజం అనువదించినది. )
Every Town a Home Town
.
Every town our home town,
Every man a kinsman.
Good and evil do not come from others.
Pain and relief of pain come of themselves.
Dying is nothing new.
We do not rejoice that
life is sweet
nor in anger
call it bitter.
Our lives,
however dear,
follow their own course,
rafts drifting
in the rapids of a great river
sounding and dashing over the rocks
after a downpour
from skies slashed by lightnings
–
we know this
from the vision
of men who see.
So,
we are not amazed by the great,
and we do not scorn the little.
.
Tamil Poem
అందరిలోనూ పరమాత్మ ఉన్నారనీ, కష్టసుఖాలకి ఒకలాగే స్పందించాలనీ కవిగారి మాటంటారా? వివరించగలరు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నమస్కారం శర్మ గారూ,
ఈ కవిత బహుపురాతనమైనది. కనుక ఇందులో భారతీయ మౌలిక తత్త్వచింతన ఏమిటో తెలుసుకుందికి ఉపయోగిస్తుంది. జీవితం గురించి మేధావులుమాత్రమే ఎక్కువగా ఆలోచించేవారు. ఎందుకంటే వాళ్ళకే విద్యా అందుబాటులో ఉండేది. మిగతావాళ్ళు వాళ్ల మార్గదర్శనంలో జీవితాల్ని మలుచుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పింది … జీవితం ఒక ప్రవాహం వంటిది. ప్రతివ్యక్తీ ఒక నదిమీదసాగే బల్లకట్టులాంటి వాడు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా జీవితాన్ని సాగనివ్వాలి. సుఖమైనా దుఃఖమైనా క్షణికమే. బల్లకట్టు ఆగదు. కనుక మనజీవితమూ తియ్యగానూ ఉండదు, చేదుగానూ ఉండదు. రెండింటి సమాహారమే. మనం ఇవ్వకూడని ప్రాధాన్యతలు సంఘటనలకి ఇవ్వడం వల్ల మనం ఉన్నచోట ఆగిపోయి దుఃఖం బారిన పడుతుంటాం.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి