అనువాదలహరి

రైల్లో… జేమ్స్ థామ్సన్, స్కాట్లండు

ఇప్పుడు ఈ కవిత చదువుతుంటే మనకి గొప్పగా కనిపించకపోవచ్చు. కానీ, ఆవిరియంత్రం కనిపెట్టబడి, పట్టాలమీద రైళ్ళు పరిగెత్తడం, అందులో ఒకేసారి కొన్ని వందలమంది ప్రయాణించగలగడం మొదటిసారి చూస్తున్నప్పుడు ఆ అనుభవం వేరు.  అయితే, ఈ కవితలో కొసమెరుపు చివరి రెండు లైన్లే. కవి ఎప్పుడు వైయక్తికమైన అనుభవాన్ని సార్వజనీనం చేస్తూ, తాత్త్వికచింతన చెయ్యగలుగుతాడో అప్పుడు ఆ కవిత కొన్ని వేలరెట్లు ఔన్నత్యాన్ని  సంతరించుకుంటుంది.

.

మనం రైల్లో ముందుకెళుతుంటే

ఇళ్ళూ చెట్లూ వెనక్కి పరిగెడుతుంటాయి,

కానీ మైదానాలమీది నక్షత్రాలు పొదిగిన ఆకాశం

మన కోసం ఎగురుకుంటూ ఎదురొస్తుంది.  

మనకి ప్రయాణంలో తోడుగా ఉండే

ఆకాశంలోని అందమైన నక్షత్రాలన్నీ

రాత్రి కారడవిలోని తెల్ల పావురాల్లా

చైతన్యరహితమైన భూమిమీదవాలి ఎగిరిపోతాయి.

మనం నిర్భయంగా ముందుకి సాగిపోతాం

గమ్యం ఎంతదూరమైనా, పరుగు ఎంత తొందరైనా!

ప్రేయసీ, కాళ్ళకిందనేల జారిపోతే జారిపోనీ

స్వర్గాన్ని మన చేతుల్లో తీసుకుపోతున్నాం. భయపడకు.

.

జేమ్స్ థామ్సన్

23 November 1834 – 3 June 1882

స్కాట్లండు 

.

James Thomson (BV)

.

In the Train

.

As we rush, as we rush in the Train,

The trees and the houses go wheeling back,      

But the starry heavens above the plain     

Come flying on our track. 

   

All the beautiful stars of the sky,              

The silver doves of the forest of Night,   

Over the dull earth swarm and fly,  

Companions of our flight.    

 

We will rush ever on without fear;   

Let the goal be far, the flight be fleet!      

For we carry the Heavens with us, dear,   

While the Earth slips from our feet!

 

.

James Thomson. (Pseudonym: Bysshe Vanolis or BV)

23 November 1834 – 3 June 1882

Scottish Poet.

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller-Couch,

 

%d bloggers like this: