అనువాదలహరి

ఎక్కడికో దూరంగా… అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్, రష్యను కవి

ఎక్కడో దూర దేశంలో ఉన్న

ఇంటికి నువ్వు ప్రయాణమయ్యావు.

ఇంతకుముందెన్నడూ ఎరుగనంత

దుఃఖంతో నీ చేతుల్లో ఏడ్చాను

నా చేతులు చల్లబడి తిమ్మిరెక్కాయి.

అయినా నిన్ను వెళ్ళకుండా ఆపడనికి

ప్రయత్నించేను; ఈ బాధకి

అంతంలేదని గాయపడ్ద నా ఆత్మకి తెలుసు.

మన గాఢమైన చుంబనం నుండి

నీ పెదాల్ని అదాత్తుగా దూరం చేశావు.

ఇలాంటి ఏకాంతప్రదేశానికి బదులు

మరో అందమైన చోటు గురించి చెబుతూ

“మేఘాచ్ఛాదనలేని అనంతాకాశం క్రింద

ఆలివ్ చెట్టు నీడల్లో మళ్ళీ

మనం ఇద్దరం కలుసుకున్నప్పుడు

ఏ బాధలూ లేని ప్రేమతో మనం

ముద్దుపెట్టుకుందాం” అని మాటిచ్చావు.

కానీ, ఏం లాభం,

ఎక్కడ ఆకసం నీలంగా మెరుస్తుందో

ఎక్కడ ఆలివ్ చెట్ల నీడలు

తళతళలాడే నీటిపై నర్తిస్తుంటాయో

అక్కడ నీ అందమూ, బాధలూ

శాశ్వతత్వంలోకి సమసిపోతాయి.

అయినా, తిరిగి కలిసుకున్నప్పుడు బాకీపడ్డ

నీ తియ్యని ముద్దుకై ఎదురుచూస్తాను.

.

అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్

(6 June 1799 – 10 February 1837)

రష్యను కవి

.

.

Bound for your distant home

.

Bound for your distant home

You were leaving alien lands.

In an hour as sad as I’ve known

I wept over your hands.

My hands were numb and cold,

Still trying to restrain

You, whom my hurt told

Never to end this pain.

But you snatched your lips away

From our bitterest kiss.

You invoked another place

Than the dismal exile of this.

You said, ‘When we meet again,

In the shadow of olive-trees,

We shall kiss, in a love without pain,

Under cloudless infinities.’

But there, alas, where the sky

Shines with blue radiance,

Where olive-tree shadows lie

On the waters glittering dance,

Your beauty, your suffering,

Are lost in eternity.

But the sweet kiss of our meeting……

I wait for it: you owe it me…….

.

Alexander Sergeyevich Pushkin

(6 June 1799 – 10 February 1837)

Russian Poet

Poem courtesy

http://www.poemhunter.com/i/ebooks/pdf/alexander_sergeyevich_pushkin_2012_6.pdf

 

 

%d bloggers like this: