అనువాదలహరి

ప్రేమ ఒక రోగం… సామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి

ప్రేమ విపత్తులతో నిండిన ఒక రోగం;

దానికి ఏ మందూ పనిచెయ్యదు;

త్రుంచుతున్నకొద్దీ పెరిగే మొక్కలాంటిది

వాడిన తర్వాత ఎందుకూ కొరగాదు

ఎందుచేత?

మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది;

దాన్ని అనుభవించలేదా,

అయ్యో అంటూ నిట్టూరుస్తుంది.

ప్రేమ ఒక మానసిక హింస,

ఎన్నటికీ వదలని తుఫాను

భగవంతుడు దాన్నో రకంగా చేశాడు

ఎప్పుడూ సుఖం ఉండదు, పూర్తవదు, కరువూ ఉండదు,

ఎందుచేత?

మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది;

దాన్ని అనుభవించలేదా,

అయ్యో అంటూ నిట్టూరుస్తుంది.

.

సామ్యూల్ డేనియల్

(1562 – 14 October 1619)

ఇంగ్లీషు కవి.

.

Samuel Daniel

.

Love is a sickness

.

Love is a sickness full of woes,        

   All remedies refusing;

A plant that most with cutting grows,       

   Most barren with best using.       

       Why so?             

More we enjoy it, more it dies;         

If not enjoyed, it sighing cries 

       Heigh-ho!    

Love is a torment of the mind,

   A tempest everlasting;               

And Jove hath made it of a kind,     

   Not well, nor full, nor fasting.      

       Why so?      

More we enjoy it, more it dies;         

If not enjoyed, it sighing cries        

       Heigh-ho!

.

Samuel Daniel

(1562 – 14 October 1619)

English Poet

 

Poem Courtesy:

The World’s Best Poetry. Volume II. Love. 1904.

Eds. Bliss Carman, et al.

%d bloggers like this: