అనువాదలహరి

భ్రమణ గీతం… ఆల్ఫ్రెడ్ హిచ్, అమెరికను (బహుశా)

కాలంతో పాటే  నేనూ దేశదేశాలు తిరుగుతాను
కాలంలాగే నేనూ, వెనక్కి తిరిగి రాను;
ఎప్పుడూ ఒక కొత్త అజరామరమైన ముఖం
నాకు ద్వారం దగ్గర స్వాగతం పలుకుతుంటుంది.  

స్నేహితులు మారరు, ప్రేమలో వేడి తగ్గదు.
జీవితం ఏ మార్పూ రాబట్టదు;
నాకు పాతవన్నీ ఎప్పటికీ పాతవే
కొత్తవి ఎప్పుడూ కొత్తవే.    

కాలంతో పాటే  నేనూ దేశదేశాలు తిరుగుతాను
కాలంలాగే నేనూ, వెనక్కి తిరిగి రాను;
ఎప్పుడూ ఒక కొత్త అజరామరమైన ముఖం
నాకు ద్వారం దగ్గర స్వాగతం పలుకుతుంది.

.

ఆల్ఫ్రెడ్ హిచ్

అమెరికను (బహుశా)

.

Wander Song

 .

I Pass with Time from place to place,          

Like Time, return no more;         

Always a new, immortal face         

To greet me at the door.

 

Friends alter not, nor love grows cold,—          

No change in life is rung;              

For me the old were always old,    

The young are always young.      

 

I pass with Time from place to place,          

Like Time, return no more;                

Always a new, immortal face         

To greet me at the door.

.

Alfred Hitch

 

Poem Courtesy

Poetry: A Magazine of Verse. 1912–22.

Harriet Monroe, ed. (1860–1936).

%d bloggers like this: