అనువాదలహరి

మనిషి బలహీనతలు… సామ్యూల్ బట్లర్, ఇంగ్లీషు కవి

మన బాధలు సత్యం ; కానీ

మన సమస్త సుఖాలు ఊహాజనితాలు.

రోగాలు వాటంతట అవే వస్తాయి,

చికిత్స మాత్రం అంత సులువుగా దొరకదు.

మన అపార ధనరాశులూ, ఇంద్రభవనాలూ

కేవలం మన సమాధులకు పెరటిళ్ళు;

కనీ వినీ ఎరుగని మహానగరాలైనా

తుదకు మిగిలేది సమాధుల భాండాగారాలుగానే.

ప్రపంచపు నిర్లక్షాన్నుంచి మనల్ని దాచుకునే

వ్యర్థ ప్రయత్నమే మన శౌర్యప్రదర్శన;

మన నగ్నత్వంలో నిండుగా కనిపించే లోపాలని

కప్పిపుచ్చుకుందికి ఆరాటపడుతూనే

ఓటమిలోనే మేలుజరిగిందని గొప్పలుపోతూ

గర్వంతో వెకిలినవ్వులు నవ్వుతాం.

.

సామ్యూల్ బట్లర్

Baptized 14 February 1613 –  25 September 1680

ఇంగ్లీషు కవి

.

Samuel Butler (Poet)

.

Upon the Weakness and Misery of Man

 .

Our pains are real things, and all

Our pleasures but fantastical.      

Diseases of their own accord,        

But cures come difficult and hard.        

Our noblest piles and stateliest rooms           

Are but outhouses to our tombs;  

Cities though ne’er so great and brave  

But mere warehouses to the grave.        

Our bravery’s but a vain disguise

To hide us from the world’s dull eyes,          

The remedy of a defect        

With which our nakedness is decked,    

Yet makes us smile with pride and boast        

As if we had gained by being lost.

.

Samuel Butler

(baptized 14 February 1613 –  25 September 1680)

English Poet

Poem Courtesy:

The Book of Restoration Verse. 1910.

Ed. William Stanley Braithwaite

http://www.bartleby.com/332/114.html

 

%d bloggers like this: