అనువాదలహరి

దూరంగా … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి

ప్రతిస్పందనలేని ఈ నేలమీది నిశ్శబ్దమూ,

ప్రత్యుత్తరం లేని కడలి గంభీరమైన ఘోషా,

రెండూ నాకు ఒకే అర్థాన్ని అందిస్తున్నాయి:

దూరం, దూరం. మేం దూరంగా ఉంటున్నాం.

నువ్వుకూడా  దూరంగా  ఉండు ఖచ్చితమైన హద్దులో:

అదే నీ లోపలి శాంతి; మేము నిన్ను కట్టిపడెయ్యము;

కాని, నీకు నువ్వు వేసుకున్న సంకెళ్ళనుండి ఎవరు విడిపించగలరు?

ఏ హృదయం నిన్ను కదల్చగలదు? ఏ చెయ్యి నిను తాకగలదు?

ఒకోసారి గర్వంగా, మరోసారి బేలగా అనిపిస్తుంది.

ఒక్కొక్కసారి పాతరోజులు గుర్తొస్తుంటాయి

అప్పుడు స్నేహాలు సంపాదించడం అంత కష్టంగా ఉండేది కాదు;

ఈ ప్రపంచమూ, నేనూ అంత పట్టనట్టు ఉండేవాళ్లం కాదు;

అప్పుడు ఇంద్రధనుసు పాదాలదగ్గర నిజంగా బంగారం లభించేది.

ఆశ చాలా ప్రబలంగా ఉండేది; జీవితం అంత బలహీనంగా ఉండేది కాదు.

.

క్రిస్టినా రోజేటి

5 December 1830 – 29 December 1894

ఇంగ్లీషు కవయిత్రి.

.

.

Aloof

.

The irresponsive silence of the land,      

The irresponsive sounding of the sea,    

Speak both one message of one sense to me:—        

Aloof, aloof, we stand aloof, so stand     

Thou too aloof, bound with the flawless band          

Of inner solitude; we bind not thee;      

But who from thy self-chain shall set thee free?       

What heart shall touch thy heart? What hand thy hand?  

And I am sometimes proud and sometimes meek,     

And sometimes I remember days of old

When fellowship seem’d not so far to seek,       

And all the world and I seem’d much less cold,       

And at the rainbow’s foot lay surely gold,      

And hope felt strong, and life itself not weak..

.

Christina Georgina Rossetti. 1830–1894

5 December 1830 – 29 December 1894

English Poetess

 

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller-Couch.

http://www.bartleby.com/101/788.html

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: