అనువాదలహరి

నిలకడ లేమి … జెఫ్రీ ఛాసర్, ఇంగ్లీషు కవి

(ఈ కవిత 600 సంవత్సరాలక్రిందటిది అంటే నమ్మడం కష్టం. ఇదేదో నిన్ననో మొన్ననో రాసినట్టుంది.  మనుషుల స్వభావంలో అప్పటినుండీ ఇప్పటివరకూ ఏమీ మార్పు లేదన్నమాట.)

ఒకప్పుడు ప్రపంచం ఎంత నిలకడగా, కలిసికట్టుగా ఉండేదంటే

మనిషి మాట ఇచ్చేడంటే, అది తన ధర్మంగా ఆచరించేవాడు.

ఇప్పుడంతా అబద్ధమూ, మాటతప్పడమూను.

ఇచ్చిన మాటా, చేసిన చేతా చివరకి వచ్చేసరికి

తల్లక్రిందులై, ఒకదానికొకటి పొంతనలేకుండా ఉంటాయి.

ప్రపంచం అంతా ఇంతేనా, కేవలం స్వార్థం, లాభాపేక్షేనా

నిలకడలేమితో అంతా సర్వనాశనం కావలసిందేనా?

మనుషులు ఈ వైరుధ్యంలో ఆనందం పొందేలా

ప్రపంచం  ఇంతగా మార్పుకి లోనవడానికి కారణం ఏమిటి?

దురుద్దేశంతో ఎవరితోనో కుమ్మక్కై పొరుగువాడికి అపకారమో,

లేక, వాడిపై ప్రతీకారం తీర్చుకోవడమో చెయ్యకపోతే

ఇప్పుడు మనిషిని అసమర్థుడిగా జమకట్టడం జరుగుతోంది.

అటువంటి నీచమైన ఆలోచనకాకపోతే

నిలకడలేమితో అంతా నాశనమవడానికి కారణం ఏమిటి?

నిజం అణగదొక్కబడుతుంది; హేతువు ఒక కట్టు కథ;

చక్కని నడవడికి అసలు విలువలేకుండా పోయింది.

జాలి దేశాంతరాలు పట్టింది; ఏ మనిషికీ ఇపుడు దయ అన్నది లేదు;

అత్యాశతో మనిషి వివేచనని చంపేసుకుంటున్నాడు;

ప్రపంచం ఎంతగా పరివర్తనచెందిందంటే

ఏది సరైనదో అది తప్పౌతుంది; నిజాయితీ చపలత్వమౌతుంది 

చివరకి నిలకడలేమితో అంతా నాశనమవుతుంది.

.

(పఠనయోగ్యంగా మార్చింది  AS Kline)

.

జెఫ్రీ ఛాసర్

1343 – 25 October 1400

ఇంగ్లీషు కవి

.

.

Lack of Steadfastness

.

Once this world was so steadfast and so stable

That a man’s word was his obligation,

And now it is so false and mutable,

That word and deed, in their conclusion,

Are unalike, for so turned upside down

Is all this world, by gain and selfishness,

That all is lost for lack of steadfastness.

 

What makes this world of ours so variable

But the pleasure folk take in dissension?

Amongst us now a man is thought unable,

Unless he can, by some vile collusion,

Wrong his neighbour, or wreak his oppression.

What causes this but such wilful baseness,

That all is lost for lack of steadfastness?

 

Truth is put down: reason is held a fable;

Virtue has now no domination,

Pity is exiled, no man is merciful.

Through greed men blind discretion;

The world has made such a permutation

Of right to wrong, truth to fickleness,

That all is lose for lack of steadfastness.

.

(Rendered readable by AS Kline)

Geoffrey Chaucer

1343 – 25 October 1400

English Poet

Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/English/ChaucerPoems.htm#_Toc186960470

%d bloggers like this: