రోజు: సెప్టెంబర్ 12, 2014
-
వసంతాగమనం… థామస్ కారీ, ఇంగ్లీషు కవి
శీతకాలం గడిచిందేమో, ధరిత్రి తన హిమస్వచ్ఛమైన శుక్లాంబరాల్ని విడిచింది. ఇక గడ్డిపరకలమీద మంచు పీచుమిఠాయిలా , స్వచ్ఛంగా పారే సెలయేటి తరగలమీదా నిర్మలమైన సరస్సుమీదా మీగడతరకలా … పేరుకోదు గోర్వెచ్చని ఎండ కొయ్యబారిన నేలని కరిగించి మెత్తబరుస్తుంది; మరణించిన పిచ్చుక పునరుజ్జీవిస్తుంది. చెట్టుతొర్రలో మత్తుగా పడుక్కున్న కోకిలనీ, గండుతుమ్మెదల్నీ తట్టిలేపుతుంది. కువకువలాడుతూ గాయకగణం స్వరరచనచేస్తూ దర్పంగా వసంతుణ్ణి ప్రకృతిలోకి ఆదరిస్తాయి. లోయలూ, కొండలూ, వనాలూ, సరికొత్త శోభతో కళ్ళు కాయలుగాచేలా ఎదురుచూస్తున్న చైత్రాన్ని స్వాగతిస్తాయి. . థామస్…