అనువాదలహరి

నా మాట నమ్మకు… ఏ కె టాల్ స్టాయ్, రష్యను కవి

ఎప్పుడైనా నేను నిన్ను ప్రేమించడం లేదంటే

ప్రియతమా! నువ్వు నా మాట విశ్వసించకు.

కెరటాలు వెనక్కి తగ్గేయని సముద్రాన్ని నమ్మకు

అది కొత్తగా విరుచుకు పడుతుంది.

అప్పుడే మనసు రాగరంజితమై నీకై పరితపిస్తోంది.

మరోసారి నా స్వాతంత్ర్యాన్ని నీకు సమర్పించుకుంటాను.

అప్పుడే అలలు ఆనందంతో తుళ్ళుతూ ఉరకలేస్తున్నాయి

ఎరిగిన ఆ ప్రేమ తీరాలని తిరిగి ముంచెత్తడానికి.

.

ఏ కె టాల్ స్టాయ్

5 September 1817 – 10 October 1875

రష్యను కవి 

 

 

 

 

A K Tolstoy

.(Second Cousin of  Leo Tolstoy)

Do Not Believe

.

Do not believe, my dearest, when I say

That I no longer love you.

When the tide ebbs do not believe the sea –

It will return anew.

Already I long for you, and passion fills me,

I yield my freedom thus to you once more.

Already the waves return with shouts and glee

To fill again that same belovèd shore.

.

Aleksey Konstantinovich Tolstoy

 

(5 September 1817 – 10 October 1875 )

Russian

Poem Courtesy: http://www.poemhunter.com/aleksey-konstantinovich-tolstoy/poems/

%d bloggers like this: