అనువాదలహరి

నిద్ర… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి

(కవిత్వమన్నా, స్నేహానికిప్రాణంపెట్టడమన్నా, ఉత్తమమైనశీలాన్ని అలవరచుకోవడమన్నా, చనిపోతున్నపుడుకూడా మానవీయవిలువలకి జీవితాన్నిఅంకితంచేసి ఉదాత్తంగా వ్యవహరించడమన్నా,  సర్ ఫిలిప్ సిడ్నీ నుండి  ఈ కాలపు కవులు నేర్చుకోవగలిగినది చాలా ఉంది.

ఇంగ్లీషు కవీ, రాజసేవకుడూ, సైనికుడూ అయిన సర్ ఫిలిప్ సిడ్నీది ఉదాత్తమైన వ్యక్తిత్వం. అతని అపురూపమైన వ్యక్తిత్వానికి చిహ్నంగా ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. తన స్నేహితుడికోసం యుధ్ధానికి వెళ్ళిన సిడ్నీ, గాయపడి పడిపోయి, దాహ దాహం అంటుంటే, ఎవరో తాగడానికి నీళ్ళు తీసుకు వచ్చి అతనికి ఇస్తే, తనపక్కనే నీటికోసం అలమటిస్తున్న ఇంకొక సైనికుడిని చూసి “నా అవసరం కంటే నీ అవసరం ఎక్కువ (your necessity is more than mine)” అని చెప్పి అతనకి నీళ్ళందించి చనిపోయాడట.  అందుకే Edmund Spencer అతనిమీద అద్భుతమైన ఎలిజీ వ్రాసేడు. అంతేగాక తన “Shephard’s Calendar” అన్న కావ్యాన్ని అంకితమిచ్చాడు. సిడ్నీ రచనలలో The Defence of poesy (aka An apology to poetry), The Arcadia, Astrophel and Stella  చాలా ముఖ్యమైనవి. )

.

ఓ నిద్రా దేవతా! రా!  ఉపశాంతికి వీడని బంధానివి

దుఃఖానికి లేపనానివి, మెదడుకి మంచి మేతవి,

నిర్భాగ్యుడి ఐశ్వర్యానివి, ఖైదీల స్వాతంత్ర్యానివి,

గొప్పా చిన్నా తారతమ్యం చూపని అపర సమవర్తివి.

నిరాశ నాపై సంధించే వాడి అమ్ముల్ని

నీ దుర్భేద్యమైన కవచంతో రక్షించు,

నా అంతరంగంలో చెలరేగుతున్న సంక్షోభాల్ని ఆపు

అలాచేస్తివా, నీకు మంచి ముడుపులు చెల్లించుకుంటాను.

ఈ మెత్తని తలగడాలు, తూలికల తల్పాలూ, తీసుకుపో

శబ్దాలు వినిపించని, వెలుగు కనిపించని ఈ భవంతినీ

ఒక గులాబి దండనీ, అలసిన నా తలనీ తీసుకుపో.

ఈ చెప్పిన వన్నీ, నీ హక్కు అంటావా, సరే కానీ,

నానుండి నీ అనుగ్రహం మాత్రం మరల్చకు. ఎందుకంటావా,

ఇంకెక్కడికన్నా కూడా అందంగా స్టెల్లా బొమ్మని చూడగలవు.

.

సర్ ఫిలిప్ సిడ్నీ

30 నవంబరు 1554 – 17 అక్టోబరు 1586

ఇంగ్లీషు కవి

.

.

Sleep

.

Come, Sleep; O Sleep! the certain knot of peace.

The baiting-place of wit, the balm of woe,

The poor man’s wealth, the prisoner’s release,

Th’ indifferent judge between the high and low;

With shield of proof shield me from out the prease

Of those fierce darts Despair at me doth throw:

O make in me those civil wars to cease;

I will good tribute pay, if thou do so.

Take thou of me smooth pillows, sweetest bed,

A chamber deaf to noise and blind of light,

A rosy garland and a weary head;

And if these things, as being thine by right,

    Move not thy heavy grace, thou shalt in me,

    Livelier than elsewhere, Stella’s image see.

.

Sir Philip Sidney

30 November 1554 – 17 October 1586

English Poet

Poem Courtesy:

http://www.bibliomania.com/0/0/frameset.html

 

%d bloggers like this: