మృత్యువుకి వినతి … కెరొలీన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి

ఓ మృత్యువా! భయపెడుతూ రాకు, ఏమాత్రం

ప్రతిఘటించని ఈ ఎరని ఎగరేసుకుపోడానికి

సాయంత్రపు నీడలా రా,

అంత నిశ్శబ్దంగానూ, అంత చాటుగానూ!

నా కన్నులు మూసి, ఊపిరి తీసుకుపో;

అప్పుడు నేను ఇష్టంగా, ఓహ్, ఇష్టంగానే

నిన్ను నేను అనుసరిస్తాను.

.

సున్నితంగా తాకితే సరిపడేచోట

ఇనపగొలుసుల అవసరమేముంది చెప్పు?

ఈ అలసిన ఆత్మ పట్టించుకోకపోయినా

అంత ఘోరంగా, అంత భయానకంగా

నల్లని ఆకృతితో భయపెట్టవలసిన అవసరం ఏముంది?

నెమ్మదిగా పిలిస్తే, సుకుమారంగా అడిగితే చాలదూ

అఖండమైన నీ శక్తిముందు మోకరిల్లడానికి?

.

నువ్వు ఎప్పుడు సంకేతం ఇస్తావో తెలియదు

పిన్నలు, అదృష్టవంతులు, రసికులు

ప్రేమించేవాళ్ళు, ప్రేమించబడేవాళ్ళు… హాయిగా

ఆనందంగా ఆశావహమైన కలలుగనేవాళ్ళు;

నీ ప్రేమపూర్వకమైన పిలుపు కఠినంగా అనిపించొచ్చు

అయిష్టంగానూ, నీరసంగానూ అయినా సరే

నువ్వు పిలిచినవాళ్ళు అనుసరించక తప్పదు.

.

నేను ఇప్పటికే చాలా జీవితం చూశాను.

నాకు అందించిన కప్పులో

మహా అయితే లేశమంత తియ్యదనం ఉండొచ్చు.

ఎంత లేశమంటే ఎంతలేశమంటే

కడపటి చుక్క వరకూ

మిగిలినదంతా చేదుగా, విషపు చేదుగా

ఉంటుందని పూర్తిగా అవగాహన అయేంత.

.

ఇక నేను బతికున్నానంటే నన్నాదరించే

మనసుని కష్టపెట్టవలసి వస్తుంది. అవును!

కష్టపెట్టడమే, సుఖపెట్టడం కాదు.

ఓ మృత్యువా! కనుక నెమ్మదిగా రా! లాలనగా రా!

నా కనులు మూసి, నా ఊపిరి తీసుకుపో;

అప్పుడు ఇష్టంగానే, ఓహ్, ఇష్టంగానే

నిన్ను నేను అనుసరిస్తాను.

.

కెరోలీన్ (బౌల్స్) సదే,

(6 December 1786  – 20 July 1854)

ఇంగ్లీషు కవయిత్రి.

.

To Death

.

Come not in terrors clad, to claim  

   An unresisting prey:

Come like an evening shadow, Death!    

   So stealthily, so silently!    

And shut mine eyes, and steal my breath;               

   Then willingly—oh! willingly,    

With thee I’ll go away.        

What need to clutch with iron grasp       

   What gentlest touch may take?  

What need, with aspect dark, to scare,           

   So awfully, so terribly,      

The weary soul would hardly care,

   Called quietly, called tenderly,   

From thy dread power to break? 

’Tis not as when thou markest out        

   The young, the blest, the gay,    

The loved, the loving—they who dream 

   So happily, so hopefully;  

Then harsh thy kindest call may seem,   

   And shrinkingly, reluctantly,            

The summoned may obey.  

But I have drunk enough of life— 

   The cup assigned to me     

Dashed with a little sweet at best,   

   So scantily, so scantily—          

To know full well that all the rest, 

   More bitterly, more bitterly,       

Drugged to the last will be. 

And I may live to pain some heart 

   That kindly cares for me—               

To pain, but not to bless. O Death!

   Come quietly—come lovingly,   

And shut mine eyes, and steal my breath;        

   Then willingly—oh! willingly,    

With thee I’ll go away.

.

Caroline (Bowles) Southey

(6 December 1786  – 20 July 1854)

Poem Courtesy: Women Poets of the Nineteenth Century. 1907.

Ed. By. Alfred H. Miles

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: