తుదిపలుకులు… జాన్ నీహార్ట్, అమెరికను కవి

ఓహ్! నన్ను సమాధిలో వెతక్కు

నేనా మట్టిలో కనిపించను!

వెలుగులో కలిసిపోడానికి

ఆ చికటి కుహరానికి ఒక కంత పెడతాను.

గడిచిన అన్ని సందర్భాలతో చెలిమిచేశాను

దిమ్మతిరిగే ఆనందమైనా, నొసలు చిట్లించే దుఃఖమైనా;

నేను గడ్డితోనూ స్నేహానికి సిద్ధమే

ఎండకాగే తలిరాకుతోనైనా సిద్ధమే.

మృత్యువు నన్ను కనుమరుగుచెయ్యలేదు;

బాధతో సానపట్టిన ఆనందపు కత్తి పట్టి

వానచినుకుల, మెరుపుల, మేఘాల

పటాలాలతో జతగూడుతాను.

ఆహ్! నా కణాల్లో ఏదో తెలియని ఉత్తేజం

నన్ను ఆనందంతో చురుకుగా లేవనెత్తుతుంది

విశ్వ సంకల్పం కొంత నన్నావహించి

ఈ గ్రహగతుల్ని ఛేదించుకుని పోతాను.

నేనూ నా దైవమూ అప్పళించుకుంటాము

వర్షమూ- సంద్రంలా, ఊపిరీ- ప్రాణ వాయువులా;

అబ్బ! ఆ ఆలోచనే ఎంత ఆశావహమైన

ప్రార్థనగా రూపుదుద్దుకుంటోంది !

.

జాన్ నీహార్ట్

January 8, 1881 – November 24, 1973

అమెరికను కవి.

.

Envoi

.

Oh, seek me not within a tomb—    

Thou shalt not find me in the clay!

I pierce a little wall of gloom  

To mingle with the day!    

   

I brothered with the things that pass,               

Poor giddy joy and puckered grief;

I go to brother with the grass 

And with the sunning leaf.   

 

Not death can sheathe me in a shroud;      

A joy-sword whetted keen with pain,             

I join the armies of the cloud, 

The lightning and the rain.   

 

Oh, subtle in the sap athrill,   

Athletic in the glad uplift,     

A portion of the cosmic will,         

I pierce the planet-drift.   


My God and I shall interknit  

As rain and ocean, breath and air; 

And oh, the luring thought of it       

Is prayer!

.

John G. Neihardt

(January 8, 1881 – November 24, 1973)

American Poet

 

The New Poetry: An Anthology. 1917.

Ed. Harriet Monroe

http://www.bartleby.com/265/262.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: