నెల: సెప్టెంబర్ 2014
-
అప్పటికప్పుడు … పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియన్ కవి
ఫిడియాస్ సృష్టి అప్పటికప్పుడు చేప నీళ్ళలో వదలడమే ఆలస్యం ఈదడం ప్రారంభిస్తుంది. . పీటర్ పోర్టర్ 16 February 1929 – 23 April 2010 ఆస్ట్రేలియన్ కవి (ఫిడియాస్ అన్న గ్రీకు శిల్పి శిల్పాలు ఎంత జీవకళ ఉట్టిపడేవంటే, అవి నిజమైనవేమోనన్న భ్రమ కల్పించేవట. ఇక్కడ మనం కావలస్తే బాపుగారిని ప్రతిక్షేపించుకోవచ్చు బాగా అర్థం అవడానికి. ) చూడడానికి ఈ కవితలో ఏముంది అనిపించవచ్చు. కేవలం శిల్పం గురించి చెప్పి ఉంటే, ఒక అతిశయోక్తి అలంకారం […]
-
ప్రతి ఊరూ స్వంత ఊరే… తమిళ కవిత
ప్రతి ఊరూ స్వంత ఊరే ప్రతి వ్యక్తి నాకు చుట్టమే. మంచీ చెడూ ఇవతలివాళ్ళ వల్ల కలగవు. బాధా, నివారణా వాటంతట అవే కలుగుతాయి. చావు మనకి కొత్తకాదు. ‘జీవితం తీయన’ అని పెద్దగా పండగ చేసుకోము. అలాగే, కోపం వచ్చిందని అది చేదని నిందించము. మన జీవితాలు ఎంత ప్రియమైనవైనప్పటికీ వాటి మార్గాన్ని అవి అనుసరిస్తాయి, మెరుపులు ఛేదించిన ఆకాశం నుండి కుంభవృష్టిగా కురిసిన వర్షానికి వడిగా పారుతున్న మహానదుల్లో మధ్యమధ్య తగిలే రాళ్ళకి కొట్టుకుని […]
-
సీగల్స్… ఇ. జె. ప్రాట్, కెనేడియన్ కవి
అవి ఎగిరిన ఒక క్షణకాలాన్ని వర్ణించడానికి భాషలో ఉపమానాలు లేవు… వెండి, స్ఫటికం, దంతం… ఇవన్నీ వెలవెలబోతున్నాయి. నీలి ఆకసం మీద చెక్కబడిన ఆ దృశ్యం నిరుపమానమైనది, ఎందుకంటే, వాటి ఎత్తూ, ఆ రెక్కల వైశాల్యమూ, నీలాకాశపువంపులో చుక్కల తీరాలని ధిక్కరిస్తుంది, లేదా, ఉపమానంగా మంచు చిన్నబోతుంది. ఇప్పుడు ఒకదాని వెనక ఒకటి పచ్చని చెట్ల కొమ్మలమీద వాలుతూ లేక వాటి రెక్కల అంచున సూర్యుడి సప్తవర్ణాలు పట్టి ఒక్కసారిగా వెయ్యి రెక్కలు విచ్చుకుంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడా […]
-
ఎక్కడో ఒకచోట… క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
ఏక్కడో ఒకచోట ఒకరుంటారు ఎన్నడూ ఎరుగని ముఖం, ఎన్నడూ వినని గొంతు నే నడిగిన మాటకి ఇంకా, ఓహ్! ఇంకా ప్రతిస్పందించని.. హృదయం. ఎక్కడో ఒకచోట, దగ్గరో, దూరమో నేలలూ సముద్రాలకీ ఆవల, కనరాని చోట; అలా తిరుగాడే చందమామకంటే దూరంగా ప్రతిరాత్రీ దాని నడకని పరిశీలించే నక్షత్రానికి ఆవల… ఎక్కడో ఒకచోట, దూరంగానో, దగ్గరో, మధ్యలో ఒక గోడో, ఒక దడో అడ్డుగా ; పచ్చికపరుచుకున్న నేలమీద చివరి ఆకులు రాల్చే శిశిరంలా. . క్రిస్టినా […]
-
రైల్లో… జేమ్స్ థామ్సన్, స్కాట్లండు
ఇప్పుడు ఈ కవిత చదువుతుంటే మనకి గొప్పగా కనిపించకపోవచ్చు. కానీ, ఆవిరియంత్రం కనిపెట్టబడి, పట్టాలమీద రైళ్ళు పరిగెత్తడం, అందులో ఒకేసారి కొన్ని వందలమంది ప్రయాణించగలగడం మొదటిసారి చూస్తున్నప్పుడు ఆ అనుభవం వేరు. అయితే, ఈ కవితలో కొసమెరుపు చివరి రెండు లైన్లే. కవి ఎప్పుడు వైయక్తికమైన అనుభవాన్ని సార్వజనీనం చేస్తూ, తాత్త్వికచింతన చెయ్యగలుగుతాడో అప్పుడు ఆ కవిత కొన్ని వేలరెట్లు ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది. . మనం రైల్లో ముందుకెళుతుంటే ఇళ్ళూ చెట్లూ వెనక్కి పరిగెడుతుంటాయి, కానీ మైదానాలమీది […]
-
పొగ మంచు…. కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను
20 వ శతాబ్దం రెండవదశకంలో ఎజ్రా పౌండ్, HD, Amy Lowell మొదలైన వాళ్ళు, కొద్దికాలమే అయినా, బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన “ఇమేజిస్టు” ఉద్యమపు భావపరంపరలో చూడాలి. అవసరానికి మించిన మాటలూ, అలంకారాలతో చెప్పదలుచుకున్న వస్తువుకప్పడిపోయిన ఆనాటి విక్టోరియన్ సంప్రదాయాలకి తిరుగుబాటుగా వచ్చింది ఈ ఉద్యమం. ఏ అలంకారాలూ, వాచాలతా లేకుండా, సరియైన పదాలు వాడుతూ (దగ్గరగా ఉండే పదం కూడా వాళ్ళు నిరసించారు) కవి తను చెప్పదలుచుకున్నది శిల్పం చెక్కినంత శ్రద్ధగా చెప్పాలి. ఈ కోణంలో […]
-
ఆలోచనలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను
వాళ్ళు నా ఆత్మని తూలికలదుప్పటిలో చుట్టారు వెచ్చగా, హాయిగా ఉండేలా చూశారు ఒక పాత పూజా కర్పటము వేసి చక్కగా చెక్కిన కుర్చీలో జాగ్రత్తగా కూచోబెట్టేరు. నా కాళ్ళకి బంగారు జోళ్ళు తొడిగేరు అది బొటనవేలుదగ్గరా, మడమదగ్గరా నొప్పెట్టింది; నా పాదాలు వయసు వాటాడి, అలసిపోయాయి, ఎలా ఉన్నాయి అని అయినా అడగలేదు. నేనిప్పుడేమయిపోయానో అని బెంగ వాళ్ళకి నా కోసం కీచుగా అరుస్తూ వెతుకుతునారు; పొడుగ్గా మొలిచిన గడ్డిదుబ్బుల్లో దాగున్నాను, వాళ్ళు పక్కనుండి పోతుంటే నవ్వుతున్నాను. […]
-
ప్రేమిక … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నీ గురించి ఇతరులు తెలుసుకున్నదానికంటే ఎక్కువ తెలియడం ఒక జీవితానికి దక్కే అపూర్వ గౌరవం, నీ గొంతు లోని రాగాలు, వాటి ఛాయలూ, రాయిలా, నిశ్చలంగా, ఏమాత్రం చలించని నీ చిత్తమూ. ఎంతో ఆనందంగా, ఏకాంతంగా,సిగ్గిలే నీ హృదయం, గంభీరమైన నవ్వూ, స్వాభిమానంలోని అభిమానం, మృదుత్వాన్ని నిర్వచించే ఆ మృదుత్వం… ఇవన్నీ భూమంత సంపన్నమూ, ఆకసమంత విశాలమూ. . సారా టీజ్డేల్, August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . . […]
-
ఎక్కడికో దూరంగా… అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్, రష్యను కవి
ఎక్కడో దూర దేశంలో ఉన్న ఇంటికి నువ్వు ప్రయాణమయ్యావు. ఇంతకుముందెన్నడూ ఎరుగనంత దుఃఖంతో నీ చేతుల్లో ఏడ్చాను నా చేతులు చల్లబడి తిమ్మిరెక్కాయి. అయినా నిన్ను వెళ్ళకుండా ఆపడనికి ప్రయత్నించేను; ఈ బాధకి అంతంలేదని గాయపడ్ద నా ఆత్మకి తెలుసు. మన గాఢమైన చుంబనం నుండి నీ పెదాల్ని అదాత్తుగా దూరం చేశావు. ఇలాంటి ఏకాంతప్రదేశానికి బదులు మరో అందమైన చోటు గురించి చెబుతూ “మేఘాచ్ఛాదనలేని అనంతాకాశం క్రింద ఆలివ్ చెట్టు నీడల్లో మళ్ళీ మనం ఇద్దరం […]
-
నన్ను విడిచిపెట్టావు… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నాకు రెండు వారసత్వంగా వదిలావు. మొదటిది ప్రేమ వారసత్వం. భగవంతుడికే గనక ఆ వారసత్వం దక్కుంటే ఎంతో సంతోషించేవాడు. అనంత సాగరాల్లాంటి ఎల్లలు లేని బాధనీ వదిలావు, కాలానికీ అనంతానికీ మధ్య నన్నూ, నీజ్ఞాపకాన్నీ మిగిల్చి. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి . You left me . You left me, sweet, two legacies,— A legacy of […]