అనువాదలహరి

థెమిస్ట నిర్ణయం … రిఛర్డ్ బ్రాత్ వైట్, ఇంగ్లీషు కవి

ఎన్నిదిక్కులు తిరిగినా

ఏ నేలనీ స్వంతం చేసుకోని బొంగరంలా;

విరిగి రాలిపోవడమే తప్ప

ఇక ఎదగలఏని వాడిపోయిన రెమ్మలా;

జీవితపర్యంతమూ

నీటికి దూరంగా నిలిచిన వంతెనలా;

టేగస్ నదికి దూరంగా ఉన్న

పుష్పించి ఫలించలేని వృక్షాల్లా;

చీకటి క్రీనీడల్లోనే

ఆనందం అనుభవించే చిమీరియన్లలా;

వాటి కూనలే అందమైనవని

భ్రమించే కోతుల్లా…

ఎవరు తన అభిప్రాయమే సరియైనదని

వల్లమాలిన ప్రేమతో అపురూపంగా భావిస్తుంటారో,

ప్రామాణికమైన ఋజువులకి గాని

హేతుబద్ధ విచారణకిగాని ఎన్నడూ తలవంచక

కూలంకషంగా చర్చించిన తీర్పు వెలువడకముందే

తమ అభిప్రాయం గెలవాలని తొందరపడతారో,

వాళ్ళకి … ఇతరుల అభిప్రాయాలకు మన్నిస్తూ

తన తప్పుడు అభిప్రాయాలని తగినరీతిలో

మార్చుకుందికి ప్రయత్నించేదాకా…

నా ఇంటిపరిసరాల్లో ఏ మాత్రం చోటియ్యను.

.

రిఛర్డ్ బ్రాత్ వైట్

(1588 – 4 May 1673)

ఇంగ్లీషు కవి.

.

.

Themista’s Reproof

.

Like a top which runneth round

And never winneth any ground;

Or th’ dying scion of a vine

That rather breaks than it will twine;

Or th’ sightless mole whose life is spent

Divided from her element;

Or plants removed from Tagus’ shore

Who never bloom nor blossom more;

Or dark Cimmerians who delight

In shady shroud of pitchy night;

Or mopping apes who are possessed

Their cubs are ever prettiest:

So he who makes his own opinion

To be his one and only minion,

Nor will incline in any season

To th’ weight of proof or strength of reason,

But prefers will precipitate

’Fore judgment that’s deliberate;

He ne’er shall lodge within my roof

Till, rectified by due reproof,

He labours to reform this ill

By giving way to others’ will.

,

Richard Brathwaite

(1588 – 4 May 1673)

Poem Courtesy:

The Book of Restoration Verse. 1910.

Ed. William Stanley Braithwaite.

http://www.bartleby.com/332/97.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: