అనువాదలహరి

లెట్టీ గ్లోబు … ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి

లెట్టీకి ఇంకా మూడో ఏడు నిండకుండానే

ముద్దులొలుకుతూ నోటంట మాటలు ప్రవహించ సాగేయి,

ఒక రోజు మేము ఆమెకి రంగుల గ్లోబు కొనిచ్చేము

అక్కడి రంగులుబట్టీ, గీతలబట్టీ

నేలా, సముద్రాలూ పోల్చుకుని తెలుసుకుంటుందని

ఆమె ఒక సారి ప్రపంచాన్ని లాలించింది;

ఆమె లేతవేళ్ళ సందుల్లోంచి సామ్రాజ్యాలు తొంగిచూసేయి

ఆ మెత్తని చేతులకి ఏ హద్దుల్లోనైనా స్వాగతమే లభించింది.

ఎలా తుళ్ళిందని! ఆ ప్రపంచాన్ని చూస్తూ, నవ్వుతూ

ఆనందాతిశయంతో ఏవేవో మాటాడింది.

కాని, ఆమె అందమైన చూపుల్ని మా ద్వీపానికి

మరలించగానే, ఒక్కసారి ఆనందంతో కేరుతూ,

“ఓ! నాకు కనిపిస్తోంది, లెట్టీ ఇల్లు ఇక్కడే ఉంది!”

అంటూ ఆమె ఇంగ్లండునంతనీ ముద్దుతో ముంచితే

బంగారంలాంటి ఆమె కురులు యూరోపుని కప్పేసేయి!

.

ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్

(జులై 4, 1808 – ఏప్రిల్ 25, 1879)

ఇంగ్లీషు కవి.

.

Letty’s Globe

.

When Letty had scarce passed her third glad year,

And her young, artless words began to flow,

One day we gave the child a colored sphere

Of the wide earth, that she might mark and know,

By tint and outline, all its sea and land.

She patted all the world; old empires peeped

Between her baby fingers; her soft hand

Was welcome at all frontiers. How she leaped,

And laughed and prattled in her world-wide bliss;

But when we turned her sweet unlearnèd eye

On our own isle, she raised a joyous cry,

“Oh! yes, I see it, Letty’s home is there!”

And, while she hid all England with a kiss,

Bright over Europe fell her golden hair!

.

Charles Tennyson Turner

(4 July 1808 – 25 April 1879)

English Poet

.

The World’s Best Poetry.

Volume I. Of Home: of Friendship. 1904.

Editors: Bliss Carman, et al.,

http://www.bartleby.com/360/1/26.html

%d bloggers like this: