అనువాదలహరి

అజ్ఞాతకు … హెలెన్ డడ్లీ, అమెరికను కవయిత్రి

వినీలాకాశంలో విచ్చలవిడిగా తిరిగే

అందమైన నక్షత్రాలనెన్నో చూశాను,

చివరకి సూర్య చంద్రుల్ని కూడా

కానీ, నీ ముఖమే చూడలేదు.

 

వయొలిన్ రాగాలని విన్నాను

చిరుగాలులూ, ఉత్తుంగ తరంగాల

అసంఖ్యాకమైన ఉల్లాసగీతికలు విన్నాను

ఒక్క నీ స్వరం తప్ప.

 

ఈ నేలమీది నల్ల కలువల్నీ

సుకుమారమైన పుష్పాలనెన్నిటినో తాకేను

పారిజాతాల్నీ, రత్నభోగి పువ్వులనీ కూడా

ఒక్క నీ చేయి తప్ప.

 

ప్రభాత సంధ్య  పాదాలని

ఒక ప్రేమికుడిలా ముద్దాడేను

వేకువ తలుపులను బార్లా తెరిచాను

ఒక్క నీ నయనాలను తప్ప.

 

మంత్రగత్తెలు సృష్టించే కల్పనలనీ,

ఊహకందని వెన్నిటినో కలగన్నాను

వింత ఆకృతులతో మాటలాడేను

ఒక్క నీతో తప్ప.

.

హెలెన్ డడ్లీ

అమెరికను కవయిత్రి.

.

To One Unknown

.

I have seen the proudest stars

That wander on through space,       

Even the sun and moon,

But not your face.

I have heard the violin,        

The winds and waves rejoice  

In endless minstrelsy,   

Yet not your voice.       

I have touched the trillium,     

Pale flower of the land,        

Coral, anemone,  

And not your hand.      

I have kissed the shining feet  

Of Twilight lover-wise, 

Opened the gates of Dawn—         

Oh not your eyes!

I have dreamed unwonted things,    

Visions that witches brew,     

Spoken with images,     

Never with you.

.

Helen Dudley

American

 

Poem Courtesy:

Poetry: A Magazine of Verse. 1912–22.

Ed. Harriet Monroe, ed. (1860–1936)

http://www.bartleby.com/300/6.html

%d bloggers like this: