అనువాదలహరి

స్త్రీజాతి శాసనం … ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

(ఈ కవిత సుమారు వంద సంవత్సరాల క్రింద వ్రాసినా, అందులో ప్రకటించిన ఆవేదనకి కారణమైన యుద్ధోన్మాదం ఎంతమాత్రం తగ్గుముఖం పట్టలేదు, సరికదా, విజృంభిస్తోంది అన్నిచోట్లా, అన్ని రకాలుగా. ఈ కవిత దాని సందర్భాన్ని కోల్పోకపోవడం ఒక పక్క ఆనందకరం, రెండోపక్క విచారకరం.

ప్రపంచశాంతికి ఇంతకంటే గొప్పకవిత ఎవరూ రాయలేరేమో   )

.

క్రీస్తు జన్మించి అప్పుడే 2 వేల సంవత్సరాలు గడిచిపోయాయి.

సాగరంలోకి భూమ్మీద ఉన్న నదులన్నీ చేరినట్టు

ఒక్కసారిగా  కొన్ని కోట్లమంది స్త్రీలు

ఒక కేంద్రస్థానంవైపు చేరుకుంటున్నారు.

వాళ్లు కొండలలోంచి, కోనల్లోంచి, తీరాలవెంబడి

అన్ని దేశాలనుండీ, ప్రాంతాలనుండీ,

అన్ని హోదాలకు చెందినవారూ

అన్ని భాషలు మాట్లాడేవారూ…

కానీ వాళ్ళు ఆలోచిస్తున్నదీ, మాటాడేదీ ఒక్కటే భాష… విశ్వశాంతి.

“వినండి,” అని వారు ప్రకటించిన ఉత్తరక్షణం

ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయింది.

మగవాళ్ళు మూగగా, వెరగుతో, చోద్యంగా చూస్తున్నారు.

“ఓ ప్రపంచనాయకులారా! వినండి!

ఈ స్త్రీజాతి ప్రకటించే శాసనాన్ని వినుకొండి:

సాటిమనుషుల్ని ప్రేమించండి అని క్రీస్తు కొత్త సందేశాన్నిచ్చి

అప్పుడే రెండువేల సంవత్సరాలు పూర్తవుతున్నాయి,

కానీ,ఈ భూమంతా ఇప్పటికీ రక్తమోడుతోంది… 

మేము యుద్ధాలు ఎప్పుడు అంతమౌతాయని అడిగితే

ప్రపంచాన్ని ఏలే మగధీరులు తమ బలహీనత ప్రదర్శిస్తున్నారు.

కనుక ఈ ప్రపంచంలోని అబలలమంతా తమ శక్తిని చాటుతూ

యుద్ధం తక్షణం ముగుస్తుందని ప్రకటిస్తున్నాము.

“ఇదే మా శాసనం. వినండి.  ఈ రోజు మొదలు

ఈ భూమండలం మీద ఏ స్త్రీ కూడా

సైనికుడికీ జన్మనివ్వదు.  మేమందరం 

ఒట్టుపెట్టుకున్నాం.  యుద్ధం కోసం

బలవంతులైన కొడుకులను కనేకంటే,

సమాధులు చేరేదాకా గొడ్రాళ్ళుగానే ఉందామని.  

అవును! పిల్లలు లేక మానవ జాతి అంతరించిపోతే, పోనీ

అంతులేని యుద్ధాలకంటే, సంతానంలేక నశించడం మెరుగు.

సేనలహాహాకారాలతో, ఫిరంగులమ్రోతతో దద్దరిల్లే దానికంటే

నిశ్శబ్దంగా ఉండే ప్రపంచమే ఎన్నోరెట్లు మెరుగు.

“మేం ఎప్పటినుండో శాంతికోసం అర్థిస్తున్నాం,

ప్రతిసారీ మాట ఇస్తూనే, యుద్ధాలు కొనసాగిస్తున్నారు.

మానవజాతిని ఆయుధరహితం చెయ్యమని  ఎన్నాళ్ళనుండో

అడుగుతుంటే, చివరకి, మా కోరికకి హేళనగా నవ్వుతూ,

“మగాడన్నవాడు” బ్రతికున్నంతకాలం యుద్ధమనివార్యమన్నారు.

అది విన్నాక మా మనసుల్లో ప్రపంచశాంతికోసం

ఒక తీవ్రమైన కోరిక బయలుదేరింది…

పెద్ద దావానలం ప్రపంచాన్ని వెలిగించినట్టు

అది ఒక  నేలనుండి మరొక నేలకీ, ఒక కడలినుండి మరో కడలికీ పాకి 

చివరకి స్త్రీలు అందరూ ఏకమై, ముక్త కంఠంతో, మనసులోమాటచెబుతునారు

ఒక్క సారి చూడండి! తిరుగులేని నిశ్చయంతో నలుదిక్కులూ ఆవరిస్తున్న

అద్భుతమైన ఈ శాంతి పోరాట  సమితిని ఒకసారి గమనించండి. 

ఓ పురుషులారా! యుద్ధాన్ని అంతంచేస్తామని మాకు మాటివ్వండి;

ప్రపంచాన్ని అస్త్ర రహితం చెయ్యండి. అప్పుడు మీకు కొడుకులని కంటాం—

నిర్మాణానికి కొడుకుల్నీ,  అలంకరించడానికి కూతుళ్ళనీ …

ఎక్కడ తక్కువమందైనా దివ్యమైన వ్యక్తులూ,

సమృద్ధీ,  అందరికీ అవకాశాలూ, శాంతీ నెలకొని ఉంటాయో

అటువంటి ఒక కొత్త ధరిత్రిని  పునర్నిర్మిద్దాం.

మీరు శాంతి వాగ్దానం చేసేదాకా

ఏ పురిటి కేకలూ ఈ వృద్ధభూమిమీద వినిపించవు.

మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం”

మగవాళ్ళు తమలో తాము తర్కించుకుంటుంటే

ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది.

.

ఎలా వ్హీలర్ విల్ కాక్స్

(November 5, 1850 – October 30, 1919)

అమెరికను కవయిత్రి .

.

(Poems usually get outdated in no time.

In a world being divided and continuously destroyed by war under every possible pretext, it is unfortunate that this poem, written over 100 years ago, has not lost its relevance….

While it is tribute to the poet, it is a sad comment on the mindset of the present day rulers of the world.

Translator.)

.

The Edict Of The Sex

.

Two thousand years had passed since Christ was born,
When suddenly there rose a mighty host
Of women, sweeping to a central goal
As many rivers sweep on to the sea.
They came from mountains, valleys, and from coasts,
And from all lands, all nations, and all ranks,
Speaking all languages, but thinking one.
And that one language–Peace.

‘Listen,’ they said,
And straightway was there silence on the earth,
For men were dumb with wonder and surprise.
‘Listen, O mighty masters of the world,
And hear the edict of all womankind:
Since Christ His new commandment gave to men,
LOVE ONE ANOTHER, full two thousand years
Have passed away, yet earth is red with blood.
The strong male rulers of the world proclaim
Their weakness, when we ask that war shall cease.
Now will the poor weak women of the world
Proclaim their strength, and say that war shall end.
Hear, then, our edict: Never from this day
Will any woman on the crust of earth
Mother a warrior. We have sworn the oath
And will go barren to the waiting tomb
Rather than breed strong sons at war’s behest,
Or bring fair daughters into life, to bear
The pains of travail, for no end but war.
Ay! let the race die out for lack of babes
Better a dying race than endless wars!
Better a silent world than noise of guns
And clash of armies.

‘Long we asked for peace,
And oft you promised–but to fight again.
At last you told us, war must ever be
While men existed, laughing at our plea
For the disarmament of all mankind.
Then in our hearts flamed such a mad desire
For peace on earth, as lights the world at times
With some great conflagration; and it spread
From distant land to land, from sea to sea,
Until all women thought as with one mind
And spoke as with one voice; and now behold!
The great Crusading Syndicate of Peace,
Filling all space with one supreme resolve.
Give us, O men, your word that war shall end:
Disarm the world, and we will give you sons –
Sons to construct, and daughters to adorn
A beautiful new earth, where there shall be
Fewer and finer people, opulence
And opportunity and peace for all.
Until you promise peace no shrill birth-cry
Shall sound again upon the aging earth.
We wait your answer.’

And the world was still
While men considered.

.

(From: Poems Of Progress)

Ella Wheeler Wilcox
(November 5, 1850 – October 30, 1919)

American author and poet

(http://www.fullbooks.com/Poems-of-Progress1.html)

2 thoughts on “స్త్రీజాతి శాసనం … ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: