రోజు: ఆగస్ట్ 13, 2014
-
మధుగీతం… అబ్రహాం కూలీ, ఇంగ్లీషు కవి
దాహంకొన్న భూమి వర్షపునీరు చుక్కమిగల్చదు అంతా తాగేసి, ఇంకా కావాలని ఎదురుచూస్తుంటుంది; వృక్షాలు నేలను పీల్చి, పీల్చి నిరంతరం తాగుబోతులై ప్రవర్తిస్తుంటాయి. పోనీ సముద్రం చూద్దామంటే (ఎవరికైనా దానికి దాహం ఏమిటనిపిస్తుంది) ఇరవైవేల నదుల్ని అవలీలగా తాగెస్తుంది ఎంతగా అంటే దాని బొజ్జ పొర్లిపోతుంది. అలా నిలకడలేక తిరుగుతుంటాడా సూరీడు (అతని జేవురుమన్నముఖం తాగుబోతని చెప్పకచెబుతుంది) సముద్రాలన్నిటినీ తాగేస్తాడు, అతని పనయిపోయేక చంద్రుడూ, నక్షత్రాలూ అతన్ని తాగెస్తాయి తాగేసి తమ పద్ధతిలో తందనాలాడతాయి, తాగి రాత్రల్ల వేడుక […]