రోజు: ఆగస్ట్ 11, 2014
-
క్లో కోసం… విలియం కార్ట్ రైట్, ఇంగ్లీషు కవి
మనిషికి రెండు పుట్టుకలుంటాయి; మొదటిది ఇంద్రియాల్ని తట్టిలేపుతూ తొలివెలుగు కిరణం పడినప్పుడు; రెండోసారి రెండు హృదయాలు ఒకటైనపుడు, మన జీవితాన్ని మళ్ళీ అక్కడనుండి లెక్కించాలి; నువ్వు నన్నూ నేను నిన్నూ ప్రేమించినపుడు మనిద్దరం కొత్తగా జన్మించినట్టే. ప్రేమ మనకి కొత్త ఆత్మలని ప్రసాదిస్తుంది వాటిలో కొత్త శక్తుల్ని కూడా పాదుకొల్పుతుంది; అప్పటినుండి మనం కొత్తజీవితం ప్రారంభిస్తాం మనం తీసుకునే ఊపిరి మనది కాదు, ప్రేమదే. వయసు వేడి తగ్గినవారినికూడా ప్రేమ యవ్వనుల్ని చేస్తుంది యవ్వనులుగా ఉన్నవాళ్ళని, యవ్వనులుగానే […]