అనువాదలహరి

పెళ్ళి … మేరీ ట్యూడర్ , అమెరికను కవయిత్రి

ఇదిగో, నిన్నే! నాకు నీ పేరిచ్చి

నీ కీర్తినీ, అపజయాల్నీ పంచుకుందికి

నీ చట్టాలతో నన్ను భార్యగా చేసుకుని,

నీ మాటతో నా జీవితాన్ని నీది చేసుకున్న నీకు

నన్ను నిరోధించడానికి నీకున్న ఆధారాలేమిటి? 

నిజమే, శాశ్వతంగా 

నేను నిన్ను అనిసరించే ఉంటాను,

కానీ, ఇంతదూరం వచ్చేక ఋజువేమిటి?

నువ్వెన్ని చట్టాలు చేసినప్పటికీ,

నేను స్వతంత్రురాలినే. నేను నీలో భాగం కాదు.

ఆగు, నా మాట పూర్తవలేదు. నువ్వు నావాడివే, 

ఎందుకంటే, నేను…  నేనూ, నువ్వూ కూడా.

నా నరనరాల్లో నీ రక్తం ప్రవహిస్తోంది,

కానీ, నీలో నాది ఏ లేశమూ లేదు.

నా మాతృత్వం ద్వారా

నేను నీకు అమరత్వాన్ని ఇస్తున్నాను.

.

మేరీ ట్యూడర్ గార్లాండ్

అమెరికను కవయిత్రి

.

Marriage

.

You, who have given me your name,        

And with your laws have made me wife, 

To share your failures and your fame,       

Whose word has made me yours for life.

What proof have you that you hold me?          

That in reality I’m one

With you, through all eternity?        

What proof when all is said and done? 

  

In spite of all the laws you’ve made,

I’m free. I am no part of you.               

But wait—the last word is not said;

You’re mine, for I’m myself and you.   

  

All through my veins there flows your blood,     

In you there is no part of me.         

By virtue of my motherhood         

Through me you live eternally.

.

Marie Tudor

Poem Courtesy:

Potter’s Clay (Page 25) by Mary Tudor,  GP Putnam’s sons, New York & London, The Knickerbocker Press, 1917.

https://archive.org/stream/pottersclaypoems00garliala#page/25/mode/1up

The poem also appears at:

Anthology of Massachusetts Poets. 1922

Ed. William Stanley Braithwaite, (1878–1962).

%d bloggers like this: