అనువాదలహరి

పువ్వులూ-ఫలితాలూ … ఎడ్గార్ గెస్ట్, అమెరికను

అక్కడా ఇక్కడా అన్నిచోట్లా

పువ్వులు పూస్తూన్న మొక్కలతో

చిన్నదో పెద్దదో ఓ పూదోట కావాలనుకుంటే

మనిషి నడుమువంచి మట్టి తవ్వక తప్పదు.

మనం కోరి సాధించగలిగిన పనులు

ఈ భూమ్మీద చాలా తక్కువగా ఉన్నాయి

మనం ఆశించినది ఏపాటి విలువైనదైనా

దాన్ని సాధించడానికి శ్రమించాల్సిందే.

ప్రశ్న నీ లక్ష్యం ఏమిటి అన్నది కాదు;

దాన్ని సాధించగల రహస్యం ఏమిటన్నది.  అది:

నీకు పువ్వులు కావాలన్నా, కోరుకున్నది కావాలన్నా

రోజు తర్వాత రోజు నువ్వు దానికై కష్టపడవలసిందే.

.

ఎడ్గార్ గెస్ట్

20 August 1881 –  5 August 1959

అమెరికను

.

Eddie Guest

.

Results and Roses

.

The man who wants a garden fair,

Or small or very big,

With flowers growing here and there,

Must bend his back and dig.

 

The things are mighty few on earth

That wishes can attain.

Whate’er we want of any worth

We’ve got to work to gain.

 

It matters not what goal you seek,

Its secret here reposes:

You’ve got to dig from week to week

To get Results or Roses.

.

Edgar A. Guest

(20 August 1881 –  5 August 1959)

English-born American Poet

 

From: The Melody of Earth

(An Anthology of Garden and Nature Poems from Present-Day Poets)

SELECTED AND ARRANGED BY

MRS. WALDO RICHARDS, March 1918

(http://www.gutenberg.org/files/38438/38438-h/38438-h.htm#Page_145)

 

%d bloggers like this: