అనువాదలహరి

అంతిమ విజయం… విల్ఫ్రెడ్ ఓవెన్ … ఇంగ్లీషు కవి

, జీసస్! గట్టిదెబ్బే తగిలింది అంటూ, అతను నేలకొరిగాడు.

అతను వృధాగా శత్రువుని శపించేడో, దేవుణ్ణి తలుచుకున్నాడో గాని,

బుల్లెట్లు మాత్రం వృధా! వృధా! వృధా! అని ముక్తకంఠంతో చెప్పేయి

మెషీన్ గన్ లు ” టట్, టట్ టట్ టట్” అంటూ నవ్వుకున్నాయి

పెద్ద ఫిరంగి బడబడా పగలబడి నవ్వింది.

 

మరొకడు, – “అమ్మా! అమ్మా! నాన్నా!”

అంటూ పిల్లాడిలా దేనికినవ్వుతున్నాడో తెలీని ముఖంతో మరణించేడు.

ఎత్తునుండి కురుస్తున్న గుళ్ళవర్షం

తాపీగా మందలించింది “మూర్ఖుడు” అంటూ

రాలి పడుతున్న వాడి ములుకులు ముసిముసిగా నవ్వేయి.

 

ప్రియతమా!” ఒకడు మూలిగేడు. ప్రేమకోసం తపిస్తున్నట్టుంది అతని స్థితి,

అతను నెమ్మదిగా కూలబడ్డాడు ముఖం మట్టిని ముద్దాడుతూ.

శత్రువు బాయ్ నెట్ కున్న పళ్ళు వెకిలిగా నవ్వేయి

ఒక్కసారిగా గుళ్ళ వర్షం మోత మోగింది

విషవాయువు బుసకొట్టింది.

.

విల్ఫ్రెడ్ ఓవెన్

18 March 1893 – 4 November 1918

ఇంగ్లీషు కవీ, WWI సైనికుడు

.

.

The Last Laugh

 

‘O Jesus Christ! I’m hit,’ he said; and died.

Whether he vainly cursed, or prayed indeed,

       The Bullets chirped – ‘In vain! vain! vain!’

       Machine-guns chuckled, ‘Tut-tut! Tut-tut!’

       And the Big Gun guffawed.

 

Another sighed, – ‘O Mother, Mother! Dad!’

Then smiled, at nothing, childlike, being dead.

       And the lofty Shrapnel-cloud

       Leisurely gestured, – ‘Fool!’

       And the falling splinters tittered.

 

‘My Love!’ one moaned. Love-languid seemed his mood,

Till, slowly lowered, his whole face kissed the mud.

       And the Bayonets’ long teeth grinned;

       Rabbles of Shells hooted and groaned;

       And the Gas hissed.

.

Wilfred Owen

18 March 18934 November 1918

English poet and soldier, one of the leading poets of the First World War  

%d bloggers like this: