అనువాదలహరి

నిన్ను ప్రేమించడం లేదు… కెరొలీన్ నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి

నిన్ను ప్రేమించడం లేదు__ నిజంగానే, నిన్ను ప్రేమించడం లేదు!

అయినా, నువ్వు కనిపించకపోతే నాకు బాధగా ఉంటుంది;

నీ నెత్తిమీది వినీలాకాశం అన్నా నాకు అసూయే,

అక్కడి నిశ్శబ్దతారకలు నిన్ను చూసి ఆనందిస్తాయని.

నేను నిన్ను ప్రేమించడం లేదు. అయినా, ఎందుకో కారణం తెలీదు,

నువ్వు ఏది చేసినా నాకు బాగున్నట్టే కనిపిస్తుంది, నాకు;

  తరచు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నిట్టూరుస్తుంటాను,

నేను ప్రేమిస్తున్నవాళ్ళు నీలాగ లేరే అని!

నేను నిన్ను ప్రేమించడం లేదు. అయినా, నువ్వు నిష్క్రమించేక

ఇతరులు, నాకు ఎంత ప్రేమాస్పదులైనా, మాటాడుతుంటే చిరాకు వేస్తుంది

ఎందుకంటే, నా చెవులపై నువ్వు విడిచిన తీయని మాటల సవ్వడి

పదే పదే చేసే ప్రతిధ్వనులకి అవి అడ్డుతగులుతుంటాయి.

 

నేను నిన్ను ప్రేమించడం లేదు!— అయినా, మాటాడే నీ కన్నులు,

చాల లోతుగా, కాంతివంతంగా, భావగర్భితంగా ఉండే ఆ కళ్ళు

నాకూ ఈ అర్థరాత్రి ఆకాశానికీ నడుమ తరచు మెరుస్తుంటాయి

నేను ఇంతవరకు ఎరిగిన ఏ కనులకన్నా భిన్నంగా. 

 

నాకు తెలుసు నిన్ను ప్రేమించడం లేదని. కాని చిత్రం!

ఎవరూ కపటంలేని నా మనసుని ఎంతమాత్రం నమ్మరు;

తరచు వాళ్ళు అలా పోతూ పోతూ నవ్వడం కనిపెడుతుంటాను,

ఎందుకంటే, వాళ్ళు నేన్నిన్ను తేరి చూడ్డం గమనిస్తుంటారు.

.

కెరోలీన్ నార్టన్

(22 March 1808 – 15 June 1877)

ఇంగ్లీషు కవయిత్రి.

.

.

I do not love Thee

.

I DO not love thee!—no! I do not love thee!

And yet when thou art absent I am sad;

   And envy even the bright blue sky above thee,

Whose quiet stars may see thee and be glad.

I do not love thee!—yet, I know not why,

Whate’er thou dost seems still well done, to me:

   And often in my solitude I sigh

That those I do love are not more like thee!

I do not love thee!—yet, when thou art gone,

I hate the sound (though those who speak be dear)

   Which breaks the lingering echo of the tone

Thy voice of music leaves upon my ear.

I do not love thee!—yet thy speaking eyes,

With their deep, bright, and most expressive blue,

   Between me and the midnight heaven arise,

Oftener than any eyes I ever knew.

I know I do not love thee! yet, alas!

Others will scarcely trust my candid heart;

   And oft I catch them smiling as they pass,

Because they see me gazing where thou art.

.

Caroline Elizabeth Sarah Norton

(22 March 1808 – 15 June 1877)

English feminist, social reformer

Poem Courtesy: http://www.bibliomania.com/0/0/frameset.html

 

 

%d bloggers like this: