అనువాదలహరి

తిరిగి పల్లెలో బ్రతకడానికి… టావో చియెన్, చీనీ కవి

యువకుణ్ణైన నాకు అందరిలాటి ఆలోచనలు లేవు

నాకు పర్వతాలూ ప్రకృతీ అంటే ఇష్టం.

తెలివితక్కువగా నేను దుమ్ముకొట్టుకుపోయిన వలలో చిక్కాను,

తెలివొచ్చేసరికి ముఫై ఏళ్ళు గడిచిపోయాయి.

 

పంజరంలోని పిట్టకి ఒకప్పటి చెట్టూ, గాలీ కావాలి

తోటలోని చేప పూర్వం స్వేచ్ఛగా తిరిగిన సెలయేటికై తపిస్తుంది

నేను సౌత్ మూర్ ఒడ్డున  ఉన్న ఒక చెలక దున్నుకుంటాను

జీవితాన్ని సీదాసాదాగా ఉంచుకుని నా నేలకీ తోటకీ పోతాను.

 

నా పొలంలో గట్టిగా చూస్తే నాలుగు మళ్ళు కూడా లేవు

నా ఇంట్లో ఎనిమిదో తొమ్మిదో గదులున్నాయి.

చింతచెట్లూ,టేకు చెట్లూ వెనక పెరడంతా నీడనిస్తే

మామిడి చెట్లూ, నేరేడూ ముంగిట్లో ఆవరించి ఉన్నాయి.

 

దూరాననున్న పల్లె మసక మసకగా కనిపిస్తోంది

వంటింటి చిమ్నీలోంచి పొగ అలలు అలలుగా తేలిపోతోంది

ఎక్కడో దూరాన వంకర్లుపోయిన బాటల్లో కుక్క మొరుగుతోంది.

మల్బరీ చెట్టు చిటారుకొమ్మనుండి కొక్కొరొకో అని పుంజు కూస్తోంది.

 

మూసిన తలుపుల వెనక ఇపుడు వేడీ దుమ్మూ లేవు

శూన్యమైన నా గదులిప్పుడు విశాలంగా, ప్రశాంతంగా ఉన్నాయి.

చాలా కాలం బందీగా, పంజరంలో చిక్కుకున్నానేమో

ఇప్పుడు నేను హాయిగా ప్రకృతితో మమేకమవొచ్చు.

.

తావో చియెన్

(365 – 427 AD)

చీనీ కవి.

T’ao Ch’ien. Encyclopedia of World Biography. 2004. Encyclopedia.com. 3 Aug. 2014

Tao Chien (aka T’ao Yüan-ming)

.

 

 Returning to Live in the Country

 .

 Young, I was always free of common feeling.

 It was in my nature to love the hills and mountains.

 Mindlessly I was caught in the dust-filled trap.

 Waking up, thirty years had gone.

 The caged bird wants the old trees and air.

 Fish in their pool miss the ancient stream.

 I plough the earth at the edge of South Moor.

 Keeping life simple, return to my plot and garden.

 My place is hardly more than a few fields.

 My house has eight or nine small rooms.

 Elm-trees and Willows shade the back.

 Plum-trees and Peach-trees reach the door.

 Misted, misted the distant village.

 Drifting, the soft swirls of smoke.

 Somewhere a dog barks deep in the winding lanes.

 A cockerel crows from the top of the mulberry tree.

 No heat and dust behind my closed doors.

 My bare rooms are filled with space and silence.

 Too long a prisoner, captive in a cage,

 Now I can get back again to Nature.

.

T’ao Ch’ien (aka  T’ao Yüan-ming)

( 365-427 AD)

Chinese Poet

Read about the poet here

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: