రోజు: ఆగస్ట్ 1, 2014
-
సుప్రభాత నామావళి … రఫేల్ ఆల్బర్టీ, స్పానిష్ కవి
లేకావి కిరణాల ప్రభాతమా! నీకు కొన్ని పేర్లు పెడుతున్నాను. నువ్వొక పొరబడ్డ కలవి, వీడని దేవకన్యవి, చెట్లమీది వర్షపు ఆభాసవి నదీప్రవాహాల్ని గుర్తుచేసుకునే నా ఆత్మాంచలాల సందిగ్ధంగా, వెనకాడుతూ, చివరకి స్థిరంగా ఉంటావు. నువ్వొక తారా విస్ఫోటనానివనీ, వేవెలుగుల ఆనందానివనీ, చప్పుడుచెయ్యని పారదర్శకతవనీ అందునా? కాదు, నువ్వు నీటిమీదిమంచుకి అపభ్రంశానివి. . రఫేల్ ఆల్బర్టీ 16 December 1902 – 28 October 1999 స్పానిష్ కవి Rafael Alberti Naming The Dawn […]