Trust-Deficit… Maheshkumar Kathi, Telugu, Indian
The fact that I am wingless
Has inhibited my desire to fly high into the sky
The concern for constraints of space
Restrained expanding my horizons
The fetters of the heart reconciled:
Pal! This is life.
There is always a conflict
Between the wonted common existence
And the uncommon exotic desires.
“Oh, you man, who proclaim
That there is nobody that you can believe!”
You are my inspiration in believing people!
“Why should the people I don’t believe
Should believe me?” … is the principal tenet of my faith.
That’s why I put my step into the air
And laid a stair onto the skies with ardour
Doubt retreated … taking to its heels
Now, the Trust-deficit, is piling up into Credits galore.
.
Mahesh Kathi
.

Mr Mahesh Kumar was born in Madanapalle of Chittoor district of Andhra Pradesh. He did his graduation from Regional College of Education, Mysore and Post-Graduation from Central University, Hyderabad in Communications, but his heart is at short stories and film making. He is an upcoming film director with some good short films to his credit. He is active on Face Book and occasionally writes poetry.
.
ట్రస్ట్ డెఫిసిట్
.
రెక్కలు లేవనే నిజం
గాల్లోకి ఎగరాలనే కోరిక కంట్రోల్ చేసింది.
ఇమడలేనేమోనన్న భయం
విశాలపడటాన్ని నియంత్రించింది.
మనసుకున్న సంకెళ్ళు
ఇంతే జీవితమని ప్రభోధించింది.
సాధారణీకరించిన అస్తిత్వం
అసాధారణ ఆశలమధ్య
ఎప్పుడూ ఒక ఘర్షణ
“ఈ ప్రపంచంలో నేను నమ్మేవాళ్ళు ఎవరూ లేరు” అన్న ఓ మనిషీ !
మనుషుల్ని నమ్మడంలో నువ్వే నాకు ప్రేరణ.
మనం నమ్మని జనం మనల్నెందుకు నమ్మాలనే ఆలోచనే
నా నమ్మకానికి పునాది
అందుకే గాలిలోకి అడుగేసాను…
ఆకాశానికి ఆర్తితో నిచ్చెనేశాను…
అపనమ్మకం ఫలాయనం పఠించింది.
ట్రస్ట్ డెఫిసిట్…క్రెడిట్ గా మారుతూనే ఉంది.
.
మహేష్ కుమార్ కత్తి
థెమిస్ట నిర్ణయం … రిఛర్డ్ బ్రాత్ వైట్, ఇంగ్లీషు కవి
ఎన్నిదిక్కులు తిరిగినా
ఏ నేలనీ స్వంతం చేసుకోని బొంగరంలా;
విరిగి రాలిపోవడమే తప్ప
ఇక ఎదగలఏని వాడిపోయిన రెమ్మలా;
జీవితపర్యంతమూ
నీటికి దూరంగా నిలిచిన వంతెనలా;
టేగస్ నదికి దూరంగా ఉన్న
పుష్పించి ఫలించలేని వృక్షాల్లా;
చీకటి క్రీనీడల్లోనే
ఆనందం అనుభవించే చిమీరియన్లలా;
వాటి కూనలే అందమైనవని
భ్రమించే కోతుల్లా…
ఎవరు తన అభిప్రాయమే సరియైనదని
వల్లమాలిన ప్రేమతో అపురూపంగా భావిస్తుంటారో,
ప్రామాణికమైన ఋజువులకి గాని
హేతుబద్ధ విచారణకిగాని ఎన్నడూ తలవంచక
కూలంకషంగా చర్చించిన తీర్పు వెలువడకముందే
తమ అభిప్రాయం గెలవాలని తొందరపడతారో,
వాళ్ళకి … ఇతరుల అభిప్రాయాలకు మన్నిస్తూ
తన తప్పుడు అభిప్రాయాలని తగినరీతిలో
మార్చుకుందికి ప్రయత్నించేదాకా…
నా ఇంటిపరిసరాల్లో ఏ మాత్రం చోటియ్యను.
.
రిఛర్డ్ బ్రాత్ వైట్
(1588 – 4 May 1673)
ఇంగ్లీషు కవి.
.
.
Themista’s Reproof
.
Like a top which runneth round
And never winneth any ground;
Or th’ dying scion of a vine
That rather breaks than it will twine;
Or th’ sightless mole whose life is spent
Divided from her element;
Or plants removed from Tagus’ shore
Who never bloom nor blossom more;
Or dark Cimmerians who delight
In shady shroud of pitchy night;
Or mopping apes who are possessed
Their cubs are ever prettiest:
So he who makes his own opinion
To be his one and only minion,
Nor will incline in any season
To th’ weight of proof or strength of reason,
But prefers will precipitate
’Fore judgment that’s deliberate;
He ne’er shall lodge within my roof
Till, rectified by due reproof,
He labours to reform this ill
By giving way to others’ will.
,
Richard Brathwaite
(1588 – 4 May 1673)
Poem Courtesy:
The Book of Restoration Verse. 1910.
Ed. William Stanley Braithwaite.
http://www.bartleby.com/332/97.html
హాప్స్… బోరిస్ పాస్టర్ నాక్, రష్యను కవి
ఐవీ లత చుట్టుముట్టిన ఈ విల్లో చెట్టు నీడన,
నీనడుముచుట్టూ నే చేతులువేసి, పొడవుకోటు
మన భుజాలపై కప్పుకుని, ఇప్పటివరకు ఎరగని
పెద్ద తుఫానుబారినుండి రక్షణ తీసుకుంటున్నాం.
అది ఐవీ లత అనుకున్నాను, నాది పొరపాటు.
పొదలన్నిటా వ్యాపించి ఈ అడవిని చుట్టింది
ఐవీ లత కాదు, హాప్స్. నీ సామీప్యం మత్తెక్కిస్తోంది!
నెచ్చెలీ! పద. ఈ పొడుగుకోటుని నేలపై పరుద్దాం.
.
బోరిస్ పాస్టర్ నాక్
(10 February 1890 – 30 May 1960)
రష్యను కవి, నవలాకారుడు, అనువాదకుడు.
ఈ కవితలోని సౌందర్యం ‘హాప్స్’అన్నపదం. దాని అర్థం గుర్తుపెట్టుకున్నపుడు, సందర్భంలోని ఔచిత్యం అవగతమౌతుంది.
Boris Pasternak
Hops*
Beneath the willow wound round with ivy
we take cover from the worst
of the storm, with a greatcoat round
our shoulders and my hands around your waist.
I’ve got it wrong. That isn’t ivy
entwined in the bushes round
the wood, but hops. You intoxicate me!
Let’s spread the greatcoat on the ground.
.
(Note:
*Hops are the female flowers (also called seed cones or strobiles) of the hop plant, Humulus lupulus. They are used primarily as a flavoring and stability agent in beer, to which they impart a bitter, tangy flavor)
.
Boris Pasternak
(10 February 1890 – 30 May 1960)
Russian Poet, Novelist, and Literary Translator.
Poem Courtesy: http://allpoetry.com/poem/8506721-Hops-by-Boris-Pasternak
కనుక… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓహ్, నా అహాన్ని అణచడానికిగాని,
నా అభిప్రాయాల్ని వంచి మార్చడానికిగాని
నువ్వెన్నడూ ప్రయత్నించలేదు కనుక…
ఆదిమ మానవుడిలా
నేను సగం భయంతో జీవించేలా చెయ్యలేదు గనుక…
ఏదో విజయ గర్వంతో చెప్పాపెట్టకుండా
నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఎన్నడూ అనుకోలేదుగనుక…
నన్ను స్వీకరించు!
ఇంతకుముందుకంటే ఇప్పుడు
నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను.
తిరుగులేని నా ఆత్మని కూడా
దానితోపాటు నీకు సమర్పించకపోతే
ఈ శరీరపు కన్యాత్వమొక్కటీ
అపురూపమూ, అరుదూ కాదు కనుక
గాలిలా ఏ నియంత్రణలోనూ లేని
నా మనసునీ, నా కలల్నీ కూడా తీసుకో!
నిన్ను “స్వామీ” అని సంభోదిస్తాను,
ఎందుకంటే నువెన్నడూ అలా పిలవమనలేదు గనుక.
.
సారా టీజ్డేల్
ఆగష్టు 8, 1884 – జనవరి 29, 1933
అమెరికను కవయిత్రి.
.
.
Because
.
Oh, because you never tried
to bow my will or break my pride
and nothing of the cave-man made
you want to keep me half afraid,
Nor ever with a conquering air
you thought to draw me unaware –
Take me, for I love you more
than I ever loved before.
And since the body’s maidenhood
Alone is neither rare nor good
Unless with it I gave to you
a spirit still untrammeled too
Take my dreams and take my mind,
that were as masterless as wind;
And “Master” I shall say to you,
Because you never asked me to.
.
Sarah Teasdale
August 8, 1884 – January 29, 1933
American Poetess
బుల్లిపిట్ట… అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్, రష్యను కవి
నేను పరదేశంలోనైనా
సంప్రదాయపు అలవాట్లూ, విధులూ నిర్వర్తిస్తాను.
నేను సంతోషంగా ఒక బుల్లి పిట్టను
వసంతోత్సవాల్లో స్వేచ్ఛగా విహరించమని వదుల్తాను.
ఇప్పుడు నాకు ఎంతో ఊరటగా ఉంది. అందుకు
సర్వశక్తిమయుడైనదేముడికి ఎంతైనా ఋణపడి ఉన్నాను.
అతని సృష్టిలో కనీసం ఒక జీవికైనా
నేను స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగేను.
.
అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్
6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837
రష్యను కవి.
.
- Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg
.
A Little Bird
.
In alien lands I keep the body
Of ancient native rites and things:
I gladly free a little birdie
At celebration of the spring.
I’m now free for consolation,
And thankful to almighty Lord:
At least, to one of his creations
I’ve given freedom in this world!
.
Alexander Sergeyevich Pushkin
6th June 1799 – 10th Feb 1837
Russian Poet
Poem Courtesy: http://www.poemhunter.com/i/ebooks/pdf/alexander_sergeyevich_pushkin_2012_6.pdf
సమాధానం… సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి
మోగించండి! కొమ్ములొత్తండి! వేణువులూదండి
ఈ సమస్త ఇంద్రియ జగత్తుకీ చాటింపు వెయ్యండి:
కొన్ని యుగాల అనామకపు జీవితం కన్న
ఉదాత్త జీవితం ఒక గంట అయినా … మిన్న.
.
సర్ వాల్టర్ స్కాట్
(15 August 1771 – 21 September 1832)
స్కాటిష్ కవి, నవలాకారుడూ, నాటక కర్తా.
.
.
Answer
.
Sound, sound the clarion, fill the fife!
To all the sensual world proclaim,
One crowded hour of glorious life
Is worth an age without a name.
.
Sir Walter Scott.
(15 August 1771 – 21 September 1832)
Scottish historical novelist, playwright, and poet
Poem Courtesy:
The Oxford Book of English Verse: 1250–1900
Ed. Arthur Quiller-Couch, ed. 1919
http://www.bartleby.com/101/545.html
లెట్టీ గ్లోబు … ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి
లెట్టీకి ఇంకా మూడో ఏడు నిండకుండానే
ముద్దులొలుకుతూ నోటంట మాటలు ప్రవహించ సాగేయి,
ఒక రోజు మేము ఆమెకి రంగుల గ్లోబు కొనిచ్చేము
అక్కడి రంగులుబట్టీ, గీతలబట్టీ
నేలా, సముద్రాలూ పోల్చుకుని తెలుసుకుంటుందని
ఆమె ఒక సారి ప్రపంచాన్ని లాలించింది;
ఆమె లేతవేళ్ళ సందుల్లోంచి సామ్రాజ్యాలు తొంగిచూసేయి
ఆ మెత్తని చేతులకి ఏ హద్దుల్లోనైనా స్వాగతమే లభించింది.
ఎలా తుళ్ళిందని! ఆ ప్రపంచాన్ని చూస్తూ, నవ్వుతూ
ఆనందాతిశయంతో ఏవేవో మాటాడింది.
కాని, ఆమె అందమైన చూపుల్ని మా ద్వీపానికి
మరలించగానే, ఒక్కసారి ఆనందంతో కేరుతూ,
“ఓ! నాకు కనిపిస్తోంది, లెట్టీ ఇల్లు ఇక్కడే ఉంది!”
అంటూ ఆమె ఇంగ్లండునంతనీ ముద్దుతో ముంచితే
బంగారంలాంటి ఆమె కురులు యూరోపుని కప్పేసేయి!
.
ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్
(జులై 4, 1808 – ఏప్రిల్ 25, 1879)
ఇంగ్లీషు కవి.
.
Letty’s Globe
.
When Letty had scarce passed her third glad year,
And her young, artless words began to flow,
One day we gave the child a colored sphere
Of the wide earth, that she might mark and know,
By tint and outline, all its sea and land.
She patted all the world; old empires peeped
Between her baby fingers; her soft hand
Was welcome at all frontiers. How she leaped,
And laughed and prattled in her world-wide bliss;
But when we turned her sweet unlearnèd eye
On our own isle, she raised a joyous cry,
“Oh! yes, I see it, Letty’s home is there!”
And, while she hid all England with a kiss,
Bright over Europe fell her golden hair!
.
Charles Tennyson Turner
(4 July 1808 – 25 April 1879)
English Poet
.
The World’s Best Poetry.
Volume I. Of Home: of Friendship. 1904.
Editors: Bliss Carman, et al.,
http://www.bartleby.com/360/1/26.html
OK, I Won’t Remind You… Manasa Chamarti, Telugu , Indian
So often,
They overwhelm me…
The days when you entered gently like a mist
And pervaded my cumulus introspective worlds of fancy.
Caressing the throbbing wayward impulses
Whelming with flourishing tender springs of age
The courses you guided love-locking
Unto the raging pinnacles of youth…
The moments
We floated adrift in ardour
Into the charming serene worlds
Of unfathomable blissful abysses.
Do you recall them by any chance? Ever?
The nights you kindled in me with your looks
Countless gleams of celestial brilliances
In such darknesses where even sounds blush?
The labyrinths of love
Where, walking together,
You pooled the desiderate pollen of passion
In the cups of your hand
To shower and win over my heart?
Those lovely moments of infinite unison
When the bubbling desires nestling in heart’s nest
Suddenly took wing breaking through the barriers into the skies?
OK, I won’t remind you.
Even in jest, I won’t test the strength of your memory.
But just promise me, that our lightning signature, too, shall lie
On all moony moments when tender buds tend to blossom.
.
Manasa Chamarti

Born and brought up in Vijayawada, Andhra Pradesh, and a student of V R Siddhartha College of Engineering there, Manasa Chamarti is an IT professional with over eight years of experience. She is the team-leader now and has moved to Bangalore.
“Madhumanasam (http://www.madhumanasam.in/), her blog which she has been running since 22nd March 2010, is a record of her fine poetic sensibilities.
“I never knew when I was drawn to literature or whose poetry had drawn me to it, but I know for sure I became her subject and since been drenched in its showers. As for me, I feel this is one way to cherish every moment of our lives,” she says rather modestly.
సరే, గుర్తుచేయన్లే!
.
గుర్తొస్తూంటాయెపుడూ,
వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో
నువు పొగమంచులా ప్రవేశించి
నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు,
లేలేత పరువాల పరవళ్ళలో
లయతప్పే స్పందనలను లాలించి
ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు
వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు ,
లోతు తెలీని లోయల్లోకి మనం
తమకంతో తరలిపోతూ
మలినపడని మంత్రలోకాల్లో ఊగిసలాడిన క్షణాలు-
నీకూ గుర్తొస్తాయా..ఎప్పుడైనా…
శబ్దాలు సిగ్గుపడే చీకట్లో
అగణిత నక్షత్ర కాంతుల్ని
నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు
కలిసి నడచిన రాగాల తోటల్లో
రాలిపడ్డ అనురాగపరాగాన్ని
దోసిళ్ళతో గుండెలపై జల్లి
నను గెల్చుకున్న త్రోవలు
గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ
గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక
ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు –
సరే, గుర్తుచేయను. సరదాకైనా,
నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను.
పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద
మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.
-మానస చామర్తి
Awaiting the day…Shamshad, Telugu, Indian
The childhood had passed
Under your loving care.
Leaving everything behind, I now
Had to move out in search of greener pastures.
And I suddenly remembered the duty of a daughter.
Oh! How far had I travelled flying in the air!
The crescent is visible every evening
Victuals are there in front, but
The granny who fed telling me stories is not around,
I don’t feel hungry anymore, now.
Toys lie scattered around
Playmates flock around me. But,
The grandpa who amused shouldering me is not around
I don’t have the humour to play any more now.
Amidst the four towering walls
Tucking the tears of memories away
I silently await the dawn of the day
When I can get back home.
.
Shamshad
Shamshad
Shamshad lives in Fremont, California. She has recently published her maiden collection of poetry “ee kitikee terucukunedi voohalloke (ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే)”
.
వక్త్ కె ఇంతెజార్ మే…
.
గుజ్ రా హువా బచ్ పన్
ఆప్ కి ప్యార్ మే
అబ్ జానా పడా సబ్ కుచ్ ఛోడ్ కర్
దౌలత్ కి చక్కర్ మే పడ్ కే
అబ్ యాద్ ఆయీ ఫర్జ్ బేటీ కా
గగన్ మే ఉడ్ కర్ కిత్నీ దూర్ ఆయీ హుc మైc
చాంద్ తొ దిఖ్ తా హర్ షామ్ కో
ఖానా తో హై సామ్నే
బతాతే ఖిలానీ వాలీ ననీ న దిఖ్ తీ
భూకీ కహాc సే.
ఖిలోనే హై సామ్నే
సహేలియా హై పాస్ మే
ఉథాకే ఖేలానేవాలా నానా న దిక్ తా
ఖేల్ నే కీ హోష్ కహాc సే
చార్ దీవారోం కి బీచ్ మే
యాదోం కీ ఆసువోం కో చుపాతేహుయే
లౌట్ చల్ నేకీ
వక్త్ కె ఇంతెజార్ మే.
.
షంషాద్
పెళ్ళి ఉంగరం … జార్జ్ క్రాబ్, ఇంగ్లీషు కవి
నువ్వు చూస్తుండగా తొడుగుతున్న ఈ ఉంగరం
పల్చగా, కళతగ్గినట్టున్నా బంగారందే;
జీవితంలోని ఆటుపోట్లకి ప్రేమ తరిగినట్టనిపించొచ్చు
అయినా, ప్రేమ ప్రేమే అని ఇది ఋజువుచేస్తుంది.
.
జార్జ్ క్రాబ్
24 December 1754 – 3 February 1832
ఇంగ్లీషు కవి
.
George Crabbe
.
A Marriage Ring
.
The ring, so worn as you behold,
So thin, so pale, is yet of gold:
The passion such it was to prove—
Worn with life’s care, love yet was love.
.
George Crabbe
24 December 1754 – 3 February 1832
English Poet, Surgeon and Clergyman.
The Oxford Book of English Verse: 1250–1900.
Ed. Arthur Quiller-Couch, ed. 1919
http://www.bartleby.com/101/482.html