రోజు: జూలై 30, 2014
-
కవి… యోనీ నొగూచి, జపనీస్ కవి
అగాధ తమోమయ జగత్తులోకి ఒత్తిగిలిన ఉదయంలా పరిపూర్ణమూ, అద్భుతమూ ఐన ఒక రహస్య ఆకారం అవతరిస్తుంది. అతని ఊర్పులు సువాసన భరితం అతని కనులు తారకాసముదయానికి త్రోవచూపించగలవు అతని ముఖంలో ప్రసన్న మరుద్వీచికలుంటాయి స్వర్లోక ప్రాభవమంతా అతని మూపున ఉంటుంది అమూర్త దివ్యరూపంలా నడచివస్తాడు అనంతమైన ప్రేమని పంచిపెడుతూ, ప్రాభాత సూర్యకిరణం అతని ఆటపట్టు మధుర సాంధ్య సంగీతం అతని పలుకు. అతని చూపు పడితే సమాధి మృత్తికలోకూడ కదలిక వస్తుంది నందనవనాలకి ప్రయాణం సాగుతుంది. . […]