రోజు: జూలై 25, 2014
-
రే స్తుతి … మేక్స్ మైకేల్సన్, అమెరికను
నిగూఢమైన ఓ రేయీ, ఇలా రా! నెమ్మదిగా దిగివచ్చి ఒద్దికగా పొదువుకో! ఏ ఆరాధనలూ లేకుండా అహంకారంతో మేము కట్టుకున్న ఇళ్ళపై నెమ్మది నెమ్మదిగా ఆవహించు. నీ ముసుగులో వాటిని దాచి దాచి నాల్గుపక్కలా నీ నీడలని ప్రసరించు. మా కార్ఖానాలపై, అంగళ్ళపై వ్యాపిస్తూ, మా అహమికలనీ, మా అవమానాలనీ నీ నీహారికా సదృశమైన రెక్కలలో మరుగుపరుచు. నున్నటి రాళ్ళుపరచిన మా వీధులలోకి అడుగుపెట్టి నీ కల్లోల పవనాల రేచుకుక్కల్ని విడిచిపెట్టు. ఓ నిశా రత్నమా! నిద్రిస్తున్న వాళ్ళని […]