రోజు: జూలై 23, 2014
-
మహావృక్షాలు కూలినపుడు… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
మహా వృక్షాలు కూలినపుడు దూరాన కొండలమీది రాళ్ళు కంపిస్తాయి, సింహాలు ఒత్తైన పొడవాటి రెల్లుపొదల్లో దాక్కుందికి పరిగెడతాయి, చివరికి ఏనుగులు సైతం ప్రాణభీతితో సురక్షితప్రదేశాలకి చేరుకుంటాయి. అడవుల్లో మహా వృక్షాలు కూలుతున్నప్పుడు చిన్నజీవాలు వాటి జ్ఞానేంద్రియాలు భయానికి హరించుకుపోయి మౌనంలోకి ముడుచుకుపోతాయి గొప్పవ్యక్తులు మరణించినపుడు మనని ఆవరించినగాలి పలచనై, తేలికై, క్రియాశూన్యమైపోతుంది. మనం ఊపిరి బిగబడతాం మనకళ్ళు క్షణికమైనా, స్పష్టంగా చూస్తాయి, మన జ్ఞాపకశక్తి ఒక్కసారిగా మరింతపదునుతేరి పరిశీలుస్తూ ఉంటుంది పైకి చెప్పని మంచిమాటలను నెమరేసుకుంటూ చేద్దామనుకుని […]