రోజు: జూలై 19, 2014
-
మైదానాలలో… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే , అమెరికను
చెలియలకట్టలోని గుల్లరాళ్ళని పలకరించే పెను అలలకీ ఒడ్డునవిరిగిపడే టన్నులబరువున్న కెరటాలకీ సముద్రమట్టానికీ, అక్కడి హోరుకీ దూరంగా… మైదానాలలో జాగాలు కొనుక్కుని, అక్కడ ఇళ్ళు కట్టుకునే వాళ్ళూ, లేదా ఇళ్ళు కొనుక్కునే వాళ్ళూ మరోసారి సముద్రపు ఉప్పునీటివాసన నేను కోరుకుంటున్నట్టు, వాళ్ళేం కోరుకుంటారు? మైదానంలోని మా ఇంట్లో, పక్కమీద తుళ్ళిపడిలేచిన నేను కోరుకుంటున్నట్టు రేవు ముఖద్వారంలోని ఓడలను చరుస్తూన్న కెరటాలు నిద్రలేపని ఆ మనుషులు ఏం కోరుకుంటారు? ఇరుకైన గదిగోడలకేసి చేతులు బాదుకుంటూ ఒక కిటికీ గాని, ద్వారబంధంగాని […]