కోరిక… సామ్యూల్ రోజర్స్, ఇంగ్లీషు కవి

కొండ పక్కన నాకో కుటీరముండాలి

తేనెటీగల ఝంకారం చెవులకు సొంపుగా సోకాలి

సన్నని సెలయేరు, ఒకమిల్లుని చుట్టివస్తూ,

గలగల దూకుతూ దాని పక్కనుండే పోవాలి.

నా పాక పంచన తరచు ఒక పిచ్చుక

తన మట్టి గూడునుండి అటూ ఇటూ తిరుగాడాలి

నిత్యమూ ఎవరో ఒక అతిథి నా తలుపు తట్టి

నా భోజనంలో పాలుపంచుకోవాలి.

ప్రహారీగోడమీద గుబురుగా పెరిగిన తీగలోని

పరిమళించే ప్రతి పువ్వూ మంచులో తడియాలి,

ఎర్రని గౌనూ, నీలి వోణీ వేసుకున్న ల్యూసీ

రాట్నం వడుకుతూ పాటలు పాడుకోవాలి.

మా పెళ్ళినాడు ప్రమాణాలు చేసుకున్న

ఊరవతల తోటలోని చర్చి గంటలు

కమ్మగా మ్రోగుతూ గాలిని సుడులు త్రిప్పి

గోపురం ద్వారంనుండి సన్నగా స్వర్గం బాట పట్టించాలి.

.

సామ్యూల్ రోజర్స్

(30 July 1763 – 18 December 1855)

ఇంగ్లీషు కవి.

.

Samuel Rogers

Samuel Rogers

http://en.wikipedia.org/wiki/Samuel_Rogers

.

A Wish

.

Mine be a cot beside the hill;  

A bee-hive’s hum shall soothe my ear;    

A willowy brook, that turns a mill,  

With many a fall shall linger near. 

 

The swallow oft beneath my thatch        

Shall twitter from her clay-built nest;      

Oft shall the pilgrim lift the latch     

And share my meal, a welcome guest.   

  

Around my ivied porch shall spring

Each fragrant flower that drinks the dew;      

And Lucy at her wheel shall sing     

In russet gown and apron blue.      

 

The village church among the trees, 

Where first our marriage vows were given,       

With merry peals shall swell the breeze            

And point with taper spire to Heaven.

.

Samuel Rogers

(30 July 1763 – 18 December 1855)

English Poet


Poem Courtesy:

The Oxford Book of Victorian Verse. 1922.

Comp:   Arthur Quiller-Couch

http://www.bartleby.com/336/18.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: