రోజు: జూలై 10, 2014
-
దేశాటనలక్కరలేదు… జేమ్స్ క్లారెన్స్ మేంగన్, ఐరిష్ కవి
శాస్త్రాలు తెలుసుకుందికి దేశాటన చెయ్యనక్కరలేదు! కొంచెం కఠినమైనది; అయితేనేం, మనసే ఖచ్చితమైన గురువు; దాన్ని, దాన్ని ఒక్కదాన్ని సరిగ్గా చదవగలిగేవంటే, నువ్వెక్కడనుండి వచ్చేవో, నువ్వేమిటో చక్కగా తెలుసుకోగలవు. తుర్క్ మన్, చైనీస్, ఈజిప్షియన్, రష్యన్, రోమన్, ఏదైతేనేం, అన్ని నాగరికతలూ పతనం వైపు దొర్లినవే. అన్నిచోట్లా పాత్రధారులు స్త్రీలూ, పురుషులే, అన్నిచోట్లా అనాదిగా చేస్తున్న ఆ దౌర్భాగ్యపు పాపాల చిట్టానే. ప్రతిచోటా మనల్ని దుష్టశక్తులు ప్రలోభపెడుతునే ఉంటాయి. ఈ నేల నీకేమిటి ఇవ్వగలదు, మన్నూ, మంచూ తప్ప? […]