నలభైఏళ్ళ మగాళ్ళు… డొనాల్డ్ జస్టిస్, అమెరికను కవి

నలభై ఏళ్ళు వచ్చిన మగాళ్ళు

మళ్ళీ తాము అక్కడికి రామని

తెలిసిన గది తలుపులను

నెమ్మదిగా వెయ్యడం నేర్చుకుంటారు.

చివరి మెట్టు ఎక్కిన తర్వాత ఆగినపుడు

కాళ్ళక్రింద కదలిక చిన్నదే అయినప్పటికీ,

పడవ పైభాగం మీద నిలబడినప్పటిలా,

కదుల్తున్నట్టు అనుభూతి చెందుతారు.

అద్దం లోతుల్లో

చిన్నప్పుడు వాళ్ళ నాన్న ‘టై’ ని

రహస్యంగా కట్టుకోవడం

సాధన చేసిన కుర్రాడి ముఖం తిరిగి చూస్తారు.

గడ్డం నిండా పరుచుకున్న నురుగుతో

చిత్రంగా కనిపించిన నాన్న ముఖం ఇప్పటికీ స్పష్టంగా

వాళ్ళలో ఇప్పుడు కొడుకుదనం కంటే తండ్రిదనమే ఎక్కువ,

వాళ్ళ మనసునిండా ఏవో ఆలోచనలు…

అవి … ఉదయరాగవేళ,

తాకట్టుపడిన తమ ఇంటివెనక

కొండ మొదలులోని దట్టమైన అడవిలో

నిండుగా వ్యాపించిన కీచురాళ్ళ రొదలా.

.

డొనాల్డ్ జస్టిస్

(August 12, 1925 – August 6, 2004)

అమెరికను కవి.

.

Donald Justice

American

.

Men at Forty

 

Men at forty

Learn to close softly

The doors to rooms they will not be

Coming back to.

 

At rest on a stair landing,

They feel it moving

Beneath them now like the deck of a ship,

Though the swell is gentle.

 

And deep in mirrors

They rediscover

The face of the boy as he practises tying

His father’s tie there in secret

 

And the face of the father,

Still warm with the mystery of lather.

They are more fathers than sons themselves now.

Something is filling them, something

 

That is like the twilight sound

Of the crickets, immense,

Filling the woods at the foot of the slope

Behind their mortgaged houses.

 

Donald Justice 

(August 12, 1925 – August 6, 2004)

American

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2005/03/men-at-forty-donald-justice.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: