రోజు: జూలై 5, 2014
-
కడలి దృశ్యం (సానెట్ 83) … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
కొండల మీద సంచరించే ఆ గొర్రెల కాపరి మేను వాల్చేడు కొండశిఖరం వరకూ పరుచుకున్న మెత్తని గడ్డిమీద, క్షితిజరేఖవద్ద ఆకాశంతో కలుస్తున్న కడలి అంచును చూస్తున్నాడో, లేక, తన వియద్దృష్టిపరిధికి బాగా దిగువన, పడమటి జలాల్లో నిప్పులు చెరుగుతూ వాలుతున్న వేసవి సూర్యుణ్ణి చూసునాడో; ఆ విశాల దృశ్యం, అద్భుతంగా, పరమ శాంతంగా, నలుదిక్కులా వ్యాపిస్తోంది, ఆ గ్రామీణుడి గుండెమీదకూడా ఒక ప్రసన్న హర్షం కానీ, దూరంగా, సముద్రజలాలపై, నల్లని మచ్చల్లా మృత్యువునద్ది రాక్షసులు కురిపిస్తున్న రోగ […]