నాకు నా మానసిక స్థితి నచ్చదు;
ఎప్పుడూ కఠినంగా, నిర్దయగా, చాడీలు చెబుతూ ఉంటాను.
నాకు నా కాళ్లు నచ్చవు, నా చేతులంటే అసహ్యం,
నాకు చక్కని ప్రదేశాలకు వెళ్ళాలని ఉండదు.
నాకు ఒకేలా వెలుగుచిమ్మే ఉదయవేళ నచ్చదు;
నాకు రాత్రి పడుక్కోవాలంటే చికాకు.
సీదాసాదా అమాయకపు మనుషులంటే ముఖం చిట్లిస్తాను.
నేను చిన్నపాటి జోకు కూడా సహించలేను.
నాకు బొమ్మలువెయ్యడంలో, రాసుకోడంలో మనశ్శాంతి లేదు.
నా ప్రపంచం అంతా ఎందుకూ పనికిరానిది.
నా కలలన్నీ కరిగిపోయాయి; గుండె బండబారిపోయింది.
నా ఆలోచనలుగాని పసిగడితే, నన్ను జైల్లో పెడతారు.
నాకు ఏ అనారోగ్యం లేదు. అలాగని బాగోనూ లేను.
ఒకనాటి నా కలలన్నీ కల్లలైపోయాయి.
నా ఆత్మ చితికిపోయింది, నా ఉత్సాహం సన్నగిలింది.
ఇక ఏమాత్రం నన్ను నేను నచ్చుకోలేను
నేను తప్పులు వెతికి, తగవులాడుతూ, సణుగుతూ, ఆక్షేపిస్తుంటాను
ఇరుకుగా కనిపిస్తున్న ఇంటిగురించే ఆలోచిస్తుంటాను,
మొగాళ్ళ పేరెత్తితే చాలు నాకు హడలు పట్టుకుంటుంది…
అయినా, మళ్ళీ నేను ప్రేమలో పడే సమయం ఆసన్నమయింది.
.
డొరతీ పార్కర్
August 22, 1893 – June 7, 1967
అమెరికను కవయిత్రి
.
Dorothy Parker
Image Courtesy: http://upload.wikimedia.org
Symptom Recital
.
I do not like my state of mind;
I’m bitter, querulous, unkind.
I hate my legs, I hate my hands,
I do not yearn for lovelier lands.
I dread the dawn’s recurrent light;
I hate to go to bed at night.
I snoot at simple, earnest folk.
I cannot take the gentlest joke.
I find no peace in paint or type.
My world is but a lot of tripe.
I’m disillusioned, empty-breasted.
For what I think, I’d be arrested.
I am not sick, I am not well.
My quondam dreams are shot to hell.
My soul is crushed, my spirit sore;
I do not like me any more.
I cavil, quarrel, grumble, grouse.
I ponder on the narrow house.
I shudder at the thought of men….
I’m due to fall in love again.
.
Dorothy Parker
August 22, 1893 – June 7, 1967
American
స్పందించండి