వాయిదావేసిన కల ఏమవుతుంది?
ఎండబెట్టిన జిగురులా
గట్టిపడిపోతుందా?
పుండులా సలిపి సలిపి
రసి కారుతుందా?
కుళ్ళిన మాంసంలా కంపుకొడుతుందా?
లేక పాకంతో చేసిన తీపి వంటకంలా
పంచదార పైన పేరుకుని తెట్టుకడుతుందా?
బహుశా బరువు ఎక్కువైన సంచిలా
క్రిందకి వేలాడిపోతుందేమో!
లేక, కొంపదీసి విస్ఫోటిస్తుందా?
.
లాంగ్స్టన్ హ్యూజ్
(February 1, 1902 – May 22, 1967)
అమెరికను.
.

స్పందించండి