అనువాదలహరి

మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక… షెల్లీ, ఇంగ్లీషు కవి.

మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక

సంగీతం జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తుంటుంది;

సుకుమారమైన పూల నెత్తావి అవి వాడిపోయినా

అవి రేకెత్తించిన ఇంద్రియజ్ఞానంలో నిక్షిప్తమై ఉంటాయి.

గులాబి రేకులు, గులాబి రాలిపోయేక

ప్రియురాలి సమాధిదగ్గర పోగుచెయ్యబడతాయి;

అలాగే, నీ ఆలోచనలు, నీ తదనంతరం,

ప్రేమ తనలోతాను నెమరువేసుకుంటుంటుంది.

.

P B షెల్లీ

4 August 1792 – 8 July 1822

ఇంగ్లీషు కవి.

.

PB Shelly Image Courtesy: http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens
PB Shelly
Image Courtesy:
http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens

.

Music, when Soft Voices die

.

Music, when soft voices die,          

Vibrates in the memory;   

Odours, when sweet violets sicken, 

Live within the sense they quicken.

Rose leaves, when the rose is dead,         

Are heap’d for the belovèd’s bed;    

And so thy thoughts, when thou art gone,     

Love itself shall slumber on.

.

Percy Bysshe Shelley.

4 August 1792 – 8 July 1822

English Poet.

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller-Couch,

http://www.bartleby.com/101/618.html

కవి… యోనీ నొగూచి, జపనీస్ కవి

అగాధ తమోమయ జగత్తులోకి
ఒత్తిగిలిన ఉదయంలా
పరిపూర్ణమూ, అద్భుతమూ ఐన
ఒక రహస్య ఆకారం అవతరిస్తుంది.

అతని ఊర్పులు సువాసన భరితం
అతని కనులు తారకాసముదయానికి త్రోవచూపించగలవు
అతని ముఖంలో ప్రసన్న మరుద్వీచికలుంటాయి
స్వర్లోక ప్రాభవమంతా అతని మూపున ఉంటుంది

అమూర్త దివ్యరూపంలా నడచివస్తాడు
అనంతమైన ప్రేమని పంచిపెడుతూ,
ప్రాభాత సూర్యకిరణం అతని ఆటపట్టు
మధుర సాంధ్య సంగీతం అతని పలుకు.

అతని చూపు పడితే
సమాధి మృత్తికలోకూడ కదలిక వస్తుంది
నందనవనాలకి ప్రయాణం సాగుతుంది.

.

యోనీ నొగూచి

December 8, 1875 – July 13, 1947

జపనీస్ కవి

.

Yone Noguchi

Yone Noguchi

.

The Poet

.

Out of the deep and the dark,          

A sparkling mystery, a shape,          

Something perfect,             

Comes like the stir of the day:         

One whose breath is an odor,                  

Whose eyes show the road to stars,

The breeze in his face,       

The glory of heaven on his back.    

He steps like a vision hung in air,    

Diffusing the passion of eternity;           

His abode is the sunlight of morn,   

The music of eve his speech:           

In his sight,           

One shall turn from the dust of the grave,     

And move upward to the woodland.

.

Yone Noguchi

December 8, 1875 – July 13, 1947

Japanese Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Ed. Harriet Monroe

http://www.bartleby.com/265/263.html

 

 

 

.

 

రుబాయీ XIV … ఉమర్ ఖయ్యాం, పెర్షియన్

మనుషులు మనసు లగ్నంచేసే లౌకికాపేక్షలు

బూడిదైపోతాయి… లేదా వర్ధిల్లుతాయి;  ఐనా, అవి త్వరలోనే

పొడిబారిన ఎడారి ముఖం మీది మంచు బిందువుల్లా

ఘడియో రెండు ఘడియలో వెలుగు వెలిగి… మాయమౌతాయి.

.

ఉమర్ ఖయ్యాం

18 May 1048 – 4 December 1131

పెర్షియన్

 

.

.

Rubai XIV

 

The Worldly Hope men set their Hearts upon

Turns Ashes — or it prospers; and anon,

Like Snow upon the Desert’s dusty Face

Lighting a little Hour or two — is gone.

.

Omar Khayyam

18 May 1048 – 4 December 1131

Persian Poet, Polymath, Philosopher, Mathematician and Astronomer.

(Courtesy: Rubaiyat of Omar Khayyam Fitzgerald’s Translation , Page 12

TN Foulis, 13& 15, Frederick Street, Edinburgh and London, MDCCCCV

https://ia700508.us.archive.org/20/items/rubaiyatfitzgera00omar/rubaiyatfitzgera00omar_bw.pdf)

 

గొర్రెలకాపరి… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి

నేనొక మందనుతోలే గొర్రెలకాపరిని

నా ఆలోచనలే నా గొర్రెలు

నా అనుభూతులే నా ఆలోచనలు.

నేను నా కళ్ళతో, చెవులతో

నా చేతులతో, కాళ్ళతో

నా ముకుపుటాలతో, నోటితో ఆలోచిస్తాను

ఒక పువ్వుని ఆలోచించడమంటే

దాన్ని చూసి వాసనచూడ్డం

ఒకపండుని తినడమంటే

దాని రుచిని అనుభూతించడం 

అందుకే, బాగా ఎండకాసిన రోజూ,

నాకు బాధకలిగినపుడూ, బాగా ఆనందం కలిగినపుడూ,

గడ్డిలో విశ్రాంతి తీసుకుందికి మేను వాలుస్తాను,

ఎండపడిన నా కళ్ళని మూసుకుంటాను 

నిజానికి నా శరీరంఅంతా సేదదీరినట్టు తెలుసుకుంటాను

ఈ సత్యాన్ని అవగాహనచేసుకున్నాక ఎంతో సుఖమనిపిస్తుంది.

.

ఫెర్నాండో పెసో

June 13, 1888 – November 30, 1935

పోర్చుగీసుకవి

 

.

The Herdsman

.

I’m herdsman of a flock.

The sheep are my thoughts

And my thoughts are all sensations.

I think with my eyes and my ears

And my hands and feet

And nostrils and mouth.

To think a flower is to see and smell it.

To eat a fruit is to sense its savor.

And that is why, when I feel sad,

In a day of heat, because of so much joy

And lay me down in the grass to rest

And close my sun-warmed eyes,

I feel my whole body relaxed in reality

And know the whole truth and am happy.

.

(Alberto Caeiro aka) Fernando Pessoa

Portuguese Poet

(Translated by Edouard Roditi from Portuguese)

Portuguese Poet

 

అంతరంగపు ప్రశాంతత … హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

గాలి ఊసులేని భూమి పొరల్ని

చీల్చుకుని ఎక్కడ నిశ్చలత ఉందో

అక్కడకి చొరబడాలని ప్రయత్నించే భీకర శబ్దాలూ,

యుద్ధాల కోలాహలమూ, ప్రార్థనలలోని సవ్వడీ,

అకస్మాత్తుగా కలిగే ఆనందాన్ని సున్నితంగా ప్రకటించే

అనురాగ నిస్వనాలూ, లజ్జ ఎరుగని నవ్వుల కంఠధ్వనులూ…

ఇవేవీ నన్ను ఎదిరించి అవమానించనూలేవు…

జ్ఞాపకాలై మనసులో పదేపదే మార్మోగనూ లేవు…

శాశ్వతమైన ప్రశాంతత నిండిన

నా అంతరాంతర కుహరాల్లోకి ప్రవేశించనూ లేవు.

బుగ్గకంటే మెత్తనైన ప్రశాంతత

పుష్పించబోతున్న మొగ్గలక్రింది నేలలో దాగుంది…

అది గంటలకొద్దీ నిర్విరామంగా మ్రోగిన

వీణియల నాదంకంటే ఉత్కృష్టమైన నిశ్శబ్దం…

అది మరుగుపడ్డ అనంతత్వంలాంటిది; అక్కడ

గొప్పగొప్ప సూర్యులు తమ ఉనికి నెమ్మదిగా చాటుతున్నా

తమకంటే శక్తిమంతమైన నిశ్శబ్దాన్ని చీల్చలేనట్టిది.

నేను అక్కడ శాశ్వతంగా వసిస్తాను…

అక్కడకి ఏ ఆలోచనా నన్ను వెంబడించలేదు…

కలతలేని కలల తూలికలు చేరనూ లేవు.

.

హారియట్ మన్రో

23 డిశంబరు 1860- 26 సెప్టెంబరు 1936

అమెరికను కవయిత్రి.

.

Harriet Monroe

 

.

The Inner Silence

.

Noises that strive to tear        

Earth’s mantle soft of air       

And break upon the stillness where it dwells:     

The noise of battle and the noise of prayer,        

The cooing noise of love that softly tells          

Joy’s brevity, the brazen noise of laughter—      

All these affront me not, nor echo after     

Through the long memories.   

They may not enter the deep chamber where      

Forever silence is.       

Silence more soft than spring hides in the ground        

Beneath her budding flowers; 

Silence more rich than ever was the sound

Of harps through long warm hours.

It’s like a hidden vastness, even as though       

Great suns might there beat out their measures slow,   

Nor break the hush mightier than they.     

There do I dwell eternally,      

There where no thought may follow me,   

Nor stillest dreams whose pinions plume the way.

.

Harriet Monroe

(December 23, 1860 – September 26, 1936)

American Poet, Editor, Scholar, Literary Critic and Patron of Arts.

The New Poetry: An Anthology. 1917.

Ed. Harriet Monroe

http://www.bartleby.com/265/253.html

మహా నగరం… హెరాల్డ్ మన్రో, ఇంగ్లండు

నేను సూర్యాస్తమయవేళ తిరిగి వచ్చేసరికి

సేవకురాలు సన్నగా ఏదో పాడుకుంటోంది.

చీకటిగా ఉండే మెట్లకిందా, ఇంటినిండా

వెన్నెలరేకలా సంధ్యవెలుగు చొరబడింది.

కాల స్పృహ ఎంతగా చచ్చుపడిందంటే

అది మధ్యాహ్నమో అర్థరాత్రోకూడా తెలియడంలేదు.

జలపాతపు నీటిలా పడుతూ, లేస్తూ, పడుతూ, ఉస్సురంటూ

నిశ్శబ్దపు శబ్దమొక్కటే శాశ్వతంగా కనిపిస్తోంది.

 

నేను నా గదిలో కూచున్నాను,

సూర్యాస్తమయాన్ని గమనిస్తున్నాను…

నక్షత్రాల వెలుగు చూశాను…

ఇంటిముఖం పట్టిన మనుషుల పాదాల చప్పుడు విన్నాను…

నిద్రపోబోతున్న కడసారి బిడ్డ చివరి మాట విన్నాను…

అప్పుడే ఒక ఒంటరి పిట్ట కూసింది…

ఒక్క సారిగా… ఇంటి కప్పులకి దూరంగా

పల్లెలో మైదానంలో గడ్డివాములమీద

అరవిరిసిన పూలమీదా… పరదాలా పొగమంచు తోచింది.

 

మెల్ల మెల్లగా లేస్తున్న చంద్రుడు…

తొలిఝాము రాతిరి కమ్మటి వాసన…

అస్పష్టమైన పాటలూ, వాటి ప్రతిధ్వనులు…

మొరుగుతున్న కుక్కలు…

మారనున్న తేదీ…

మత్తుగా కమ్ముకొస్తున్న నిద్ర…

తనివి తీరుతున్న విశ్రాంతి…

నగరంలోని దీపాలన్నీ వెలిగినతర్వాత

వీధుల్లోకి వెళ్ళి నగరాన్ని పరికించాను

చాలా హుషారుగా,  హాయిగా తిరిగాను

సగంరాత్రంతా వీధుల్లోనే తిరుగుతూ గడిపేను. 

.

హెరాల్డ్ మన్రో

(మార్చి 14, 1879 – మార్చి 16, 1932)

ఇంగ్లండు.

 

 Harold Monro

Image Courtesy:

 http://img.poemhunter.com/p/57/38957_b_3938.jpg

.

Great City

.

When I returned at sunset,              

The serving-maid was singing softly           

Under the dark stairs, and in the house       

Twilight had entered like a moon-ray.        

Time was so dead I could not understand          

The meaning of midday or of midnight,     

But like falling waters, falling, hissing, falling,        

Silence seemed an everlasting sound.          

I sat in my room,               

And watched sunset,                 

And saw starlight.             

I heard the tramp of homing men,

And the last call of the last child;  

Then a lone bird twittered,             

And suddenly, beyond the housetops,                  

I imagined dew in the country,      

In the hay, on the buttercups;         

The rising moon,               

The scent of early night,  

The songs, the echoes,             

Dogs barking,     

Day closing,        

Gradual slumber,              

Sweet rest.           

When all the lamps were lighted in the town                     

I passed into the street ways and I watched,

Wakeful, almost happy,  

And half the night I wandered in the street.

.

Harold Monro

(14 March 1879 – 16 March 1932)

British Poet

 

Poem Courtesy:

The New Poetry: An Anthology. 1917

Ed: Harriet Monroe, ed. (1860–1936)

 

http://www.bartleby.com/265/246.html

రే స్తుతి … మేక్స్ మైకేల్సన్, అమెరికను

నిగూఢమైన ఓ రేయీ, ఇలా రా! 

నెమ్మదిగా దిగివచ్చి ఒద్దికగా పొదువుకో!

ఏ ఆరాధనలూ లేకుండా

అహంకారంతో మేము కట్టుకున్న ఇళ్ళపై

నెమ్మది నెమ్మదిగా ఆవహించు.

నీ ముసుగులో వాటిని దాచి దాచి

నాల్గుపక్కలా నీ నీడలని ప్రసరించు.

మా కార్ఖానాలపై, అంగళ్ళపై 

వ్యాపిస్తూ, మా అహమికలనీ,

మా అవమానాలనీ

నీ నీహారికా సదృశమైన రెక్కలలో 

మరుగుపరుచు.

నున్నటి రాళ్ళుపరచిన మా వీధులలోకి అడుగుపెట్టి

నీ కల్లోల పవనాల రేచుకుక్కల్ని విడిచిపెట్టు.

ఓ నిశా రత్నమా! నిద్రిస్తున్న వాళ్ళని సమీపించు.

వాళ్ళ కలల్లో నీ జ్వాలల్ని రగుల్చు. 

.

మేక్స్ మైకేల్సన్

(1880-1953)

అమెరికను

.

A Hymn to Night

.

Come, mysterious night; 

Descend and nestle to us. 

Descend softly on the houses          

We built with pride,          

Without worship.                      

Fold them in your veil,    

Spill your shadows.           

Come over our stores and factories,            

Hide our pride—our shame—       

With your nebulous wings.                    

Come down on our cobbled streets:              

Unleash your airy hounds.              

Come to the sleepers, night;            

Light in them your fires.

.

Max Michelson

(1880-1953)

American

Read about the poet here: http://www.mellenpress.com/mellenpress.cfm?bookid=2959&pc=9

Poem Courtesy:

The New Poetry: An Anthology. 1917

Ed: Harriet Monroe, ed. (1860–1936)

 

http://www.bartleby.com/265/241.html

అనుమానపు మనసు… ఎలిజబెత్ మహారాణి 1 ఇంగ్లండు

పాదాల వంకర లేదు, కళ్ళు పువ్వువెయ్యనూ లేదు,

శరీరంలో ఏ భాగమూ ఎబ్బెట్టుగా అసహజంగా లేవు.

అయితేనేం, అవన్నీ ఉన్నా, నిత్యమూ రహస్యంగా,

అనుమానించే మనసుకంటె, సగంకూడా అసహ్యంగా ఉండవు.

.

ఎలిజబెత్ రాణి 1

(7 September 1533 – 24 March 1603)

(1520లో  పారిస్ లో ముద్రించబడ్డ ఫ్రెంచి ప్రార్థనా గీతాల పుస్తకంలో చివరి పేజీలో ఆమెచే  ఈ కవిత రాయబడి  సేవకునికో, స్నేహితునికో నవంబరు 17, 1558కి ముందు ఇవ్వబడినట్టు అంచనా .)

.

 Queen Elizabeth 1

 

Written In A French Psalter

.

No crooked leg, no bleared eye,
No part deformed out of kind,1
Nor yet so ugly half can be
As is the inward,2 suspicious mind.

.

(Note: 

1 Out of Kind: So as to be unnatural

2 Inward: Secret)

.

Princess Elizabeth I

(7 September 1533 – 24 March 1603) 

Queen Of England

Poem Courtesy:

http://www.luminarium.org/renlit/elizapsalter.htm

 

 

 

మహావృక్షాలు కూలినపుడు… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి

మహా వృక్షాలు కూలినపుడు

దూరాన కొండలమీది రాళ్ళు కంపిస్తాయి,

సింహాలు ఒత్తైన పొడవాటి రెల్లుపొదల్లో

దాక్కుందికి పరిగెడతాయి,

చివరికి ఏనుగులు సైతం

ప్రాణభీతితో సురక్షితప్రదేశాలకి చేరుకుంటాయి.

అడవుల్లో

మహా వృక్షాలు కూలుతున్నప్పుడు

చిన్నజీవాలు

వాటి జ్ఞానేంద్రియాలు భయానికి హరించుకుపోయి

మౌనంలోకి ముడుచుకుపోతాయి

గొప్పవ్యక్తులు మరణించినపుడు

మనని ఆవరించినగాలి

పలచనై, తేలికై, క్రియాశూన్యమైపోతుంది.

మనం ఊపిరి బిగబడతాం

మనకళ్ళు

క్షణికమైనా,

స్పష్టంగా చూస్తాయి,

మన జ్ఞాపకశక్తి

ఒక్కసారిగా మరింతపదునుతేరి

పరిశీలుస్తూ ఉంటుంది

పైకి చెప్పని మంచిమాటలను నెమరేసుకుంటూ

చేద్దామనుకుని చెయ్యలేకపోయిన

పనులు గుర్తుచేసుకుంటున్న మనల్ని …

మాహాత్ముల మరణంతో

వాళ్లతో పెనవేసుకున్న

మన అస్తిత్వం

మననుండి శలవు తీసుకుంటుంది.

వాళ్ళ ప్రకృతిమీద ఆధారపడిన

మన ఆత్మలు

ముడుచుకుని, శుష్కించిపోతాయి.

మన ఆలోచనలు

వాళ్ళ దీప్తి వల్ల ప్రేరేపింపబడి,

వికసించినవి కావడంవల్ల

వారితోనే చెల్లాచెదరైపోతాయి. 

మనకి ఎంతగా బుద్ధి మాంద్యం వస్తుందంటే

చెప్పలేని అజ్ఞానపు

అంధకార గుహల్లోకి చొరబడతాము. 


గొప్పవ్యక్తులు మరణించినతర్వాత

కొంత కాలానికి మళ్ళీ ప్రశాంతత చేకూరుతుంది

నెమ్మదిగా.  దానికో క్రమం ఉండదు. 

హాయినికూర్చే విద్యుత్తరంగాలలా

శరీరంలో ప్రశాంతత నెమ్మదిగా నిండుతుంది.

మన ఇంద్రియాలు మనకి చేకూరినా

అవి ఎన్నడూ మునుపటిస్థితి చేరుకోలేవు.

అయినా అవి గుసగుసలాడుతాయి: 

“వాళ్ళు ఇక్కడ జీవించేరు; ఇక్కడే జీవించేరు.

మనంకూడా బ్రతకగలం. మునపటికంటె మెరుగ్గా.

ఎందుకంటే, వాళ్ళు మనముందే జీవించేరు గనుక.”

.

మాయా ఏంజెలో

అమెరికను కవయిత్రి.

.

Maya Angelou

.

When Great Trees Fall

.

When great trees fall,

rocks on distant hills shudder,

lions hunker down

in tall grasses,

and even elephants

lumber after safety.

When great trees fall

in forests,

small things recoil into silence,

their senses

eroded beyond fear.

When great souls die,

the air around us becomes

light, rare, sterile.

We breathe, briefly.

Our eyes, briefly,

see with

a hurtful clarity.

Our memory, suddenly sharpened,

examines,

gnaws on kind words

unsaid,

promised walks

never taken.

Great souls die and

our reality, bound to

them, takes leave of us.

Our souls,

dependent upon their

nurture,

now shrink, wizened.

Our minds, formed

and informed by their

radiance,

fall away.

We are not so much maddened

as reduced to the unutterable ignorance

of dark, cold

caves.

And when great souls die,

after a period peace blooms,

slowly and always

irregularly. Spaces fill

with a kind of

soothing electric vibration.

Our senses, restored, never

to be the same, whisper to us.

They existed. They existed.

We can be. Be and be

better. For they existed.

.

Maya Angelou

American

On The Easel … Nareshkumar, Telugu, Indian

 

 

No great expectations I entertained for

The picture to be amazing;

I just went on caressing with the brush across;

I did not even think of some deadline

To finish it before.

 

Even as I blotted clean the stains of blood

That seeped up to the fore arms

While I was drawing some fine cambering lines

With the obliquely abrased heart,

I did not wish this painting stand out

Counted for a wonderful work.

 

Of course,

I did hope,

When once in some distant future

This picture commands attention,

Some hands should caress

The blank spaces I left

With compassion

And complemented

With their finger prints,

The painting should greet me in delight.

 

Even when I borrowed

The somatic sensation of some

Grassy inflorescence

Which preserved their smiles

Hiding under the snowy veil

On some pretty cool shadowy nights

To daub this painting,

I did not aspire it

An amazing piece of work.

However

I wanted to leave it a memento

To the streaks of blood

That’s why

I left the place blank

Where I should have left my signature.

 

Perpetually on the easel

The Painting still works upon itself

Over and again with unrestrained freedom.

Even the passers-by

Peep into the ever-changing canvas

To identify themselves

And bid adieu

After endlessly refurbishing it with fresh colours.

 

.

Naresh Kumar

 

 

ఒక అసంపూర్తి చిత్రం

 

నెనెప్పుడూ అనుకోనేలేదు
ఆ చిత్రం అద్బుతంగానే ఉండాలని
అలా కుంచెని కదిలిస్తూ పోయానంతే
అదెప్పటికో పూర్తవాలనికూడా
నేననుకోనేలేదు

 

కోసుగా చెక్కిన గుండెతో
కొన్ని వంపుతిరిగే
సన్నని గీతలని చిత్రించేప్పుడు
మోచేతులదాకా
సాగిన రక్తపు చారికలని
తుడుచుకుంటున్నప్పుడు కూడా
నేను ఆ చిత్రాన్ని అద్బుతమైనదిగా
నిలబడితే బాగుండనుకోలేదు

 

కాకపోతే
ఆ చిత్రం ఒకానొక కాలపు
వేదికపైకి కొనిపోబడినప్పుడు
నేను ఖాలీగా వదిలిన
ప్రదేశాలని
కొందరి చేతులు ఆప్యాయంగా తడమాలనుకొన్నాను
వారి చేతుల గుర్తులతో
నింపబడిన ఆ చిత్రం
నన్ను నవ్వుతూ ఆ వేదికపైకి
ఆహ్వానించాలనుకున్నాను

 

అతి చల్లని నీడల రాత్రులలో
మంచు దుప్పటి కప్పుకొని
కొన్ని నవ్వులని దాచుకున్న గడ్డిపువ్వుల
స్పర్శ ని తెచ్చి
ఆచిత్రానికి పూస్తున్నప్పుడు
ఆ చిత్రం అద్బుతంగా ఉండాలని నేననుకోలేదు

 

 

కానీ
కొన్ని రక్తపు మరకల గుర్తుగా
దాన్ని వదిలేయాలనుకున్నాను

అందుకే
నేనా చిత్రం కిందుగా
సంతకం చేయాల్సిన ప్రదేశాన్ని
ఖాలీగా ఉంచేయదలిచాను

 

ఇకా ఆ అసంపూర్తి చిత్రం
స్వేచ్చగా తనని తాను చిత్రించుకుంటూనేఉంటుది
ఆ పక్కగా నడుస్తూ వెల్లిపోయే
వారంతా
క్షణక్షణమూ కొత్తగా
మారిపోయే ఆ చిత్రం లో తమని తాము
వెతికి గుర్తించుకుంటారు
అనంతానంతంగా రంగులని అక్కడ గుమ్మరించి
వెళ్ళిపోతూనే ఉంటారు…..

 

02/07/14

నరేష్కుమార్

 

%d bloggers like this: