అనువాదలహరి

భిన్నాభిప్రాయాలు … వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను

వాళ్ళు నా ఆత్మని మెత్తని తూలికలలో చుట్టేరు

నన్ను వెచ్చగా  ఒద్దికగా అలంకరించేరు

ఒక కొత్తగా మలిచిన కుర్చీలో; భద్రంగా ఉంచేరు

ఒక పాత ప్రార్థనా కంబళి మీద. 

వాళ్లు నా పాదాలని బంగారు జోళ్ళలో జొనిపేరు

కాలి మడమలదగ్గరా, వేళ్లదగ్గరా నొప్పెట్టింది కూడా;

విరామమెరుగని నా పాదాలని, చురుకుగా తిరిగే పాదాలని

ఎలా ఉన్నాయని కూడా కనీసం అడగలేదు.

ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం  నేనెక్కడున్నానో నని

కీచుగొంతుతో, దీనంగా అరుస్తూ, వెతుకుతుంటారు;

నేనుమాత్రం పొడవాటి రెల్లు పొదల్లో నక్కి ఉంటాను

వాళ్ళు  నా పక్కనుంచే వెళ్తుంటే నవ్వుకుంటూ .

.

వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్

(1856-1959)

అమెరికను .

.

Cross-Currents

 .

They wrapped my soul in eiderdown;

   They placed me warm and snug     

In carvèd chair; set me with care        

   Upon an old prayer rug.

       

They cased my feet in golden shoes          

   That hurt at toe and heel;     

My restless feet, with youth all fleet, 

   Nor asked how they might feel.    

 

And now they wonder where I am,    

   And search with shrill, cold cry;           

But I crouch low where tall reeds grow,      

   And smile as they pass by!

.

Winifred Virginia Jackson

(1856 – 1959)

American

Poem Courtesy:

Anthology of Massachusetts Poets. 1922

Ed. William Stanley Braithwaite (1878–1962).

%d bloggers like this: