అనువాదలహరి

నేను పక్షినైనపుడు… కేథరీన్ మేన్స్ ఫీల్డ్, న్యూజిలాండిష్ బ్రిటిష్ కవయిత్రి

నేను కరక(1) చెట్టు పైకెక్కి

అక్కడ ఈకల్లా మెత్తగా ఉండే

ఆకుల గుబురుల్లో దాగేను.

నేనొక పాట కట్టేను  అందులో ఏ పదాలూ లేనప్పటికీ

తెలియకుండా పాడసాగేను… చివరకి అది విషాదమైంది.

చెట్టుక్రింద గడ్డిలో పూలు విరగబూశాయి.

అవి ఏమంటాయో చూద్దామని

“నేను మీ తలలు కొరికి నా చిన్నారులకి

తినడానికి ఇస్తాను,” అన్నాను.

అవి నేను పక్షినంటే నమ్మలేదు;

అవి చాలా చక్కగా విచ్చుకునే ఉన్నాయి.

తెల్లని తూలికలతో కప్పిన నీలి గూడులా ఉంది ఆకాశం

సూర్యుడు దాన్ని వెచ్చగా ఉంచే తల్లి పక్షిలా ఉన్నాడు.

నా పాటలో మాటలు లేనప్పటికీ, చెప్పిన భావం అదే

మా తమ్ముడు  ఒంటిచక్రపుబండి తిప్పుకుంటూ పొలంవైపు

పరిగెత్తుకుని వొచ్చాడు; నా దుస్తుల్ని రెక్కల్లా పరిచి నిశ్శబ్దంగా ఉన్నాను.

వాడు నా దగ్గరకు రాగానే, నేను “కుహూ కుహూ” అన్నాను.

వాడొక క్షణం సేపు బిత్తరపోయి చూశాడు;

తర్వాత, “ఫో! ఫో! నువ్వు పక్షివేం కాదు.

నాకు నీ కాళ్ళు కనపడుతునాయి.” 

గడ్డిపూలు కాదంటే నేమి,

మా తమ్ముడు కాదంటే నేమి?

నాకు మాత్రం నేను పక్షినే అని అనిపించింది.

.

కేథరీన్ మేన్స్ ఫీల్డ్

(14 October 1888 – 9 January 1923)

న్యూజిలాండిష్ బ్రిటిష్ కవయిత్రి

(Note: 1 కరక (Karaka Tree ):

ఇది న్యూజిలాండుకి మాత్రమే పరిమితమై  మెత్తని ఆకులతో బాగా పొడవుగా పెరిగే చెట్టు )

 

.

Katherine Mansfield

.

When I Was a Bird

.

I climbed up the karaka tree

Into a nest all made of leaves

But soft as feathers.

I made up a song that went on singing all by itself

And hadn’t any words, but got sad at the end.

There were daisies in the grass under the tree.

I said just to try them:

“I’ll bite off your heads and give them to my little

children to eat.”

But they didn’t believe I was a bird;

They stayed quite open.

The sky was like a blue nest with white feathers

And the sun was the mother bird keeping it warm.

That’s what my song said: though it hadn’t any words.

Little Brother came up the patch, wheeling his barrow.

I made my dress into wings and kept very quiet.

Then when he was quite near I said:”Sweet, sweet!”

For a moment he looked quite startled;

Then he said:”Pooh, you’re not a bird; I can see

your legs.”

But the daisies didn’t really matter,

And Little Brother didn’t really matter;

I felt just like a bird.

.

Katherine Mansfield

(14 October 1888 – 9 January 1923)

New Zealand-England

%d bloggers like this: