ఒక మంచుపెర్ల తో… ఫ్రాన్సిస్ థామ్సన్, ఇంగ్లీషు కవి
అసలు నిన్ను ఏ మనసు ఊహించగలిగింది?
మా కల్పనాశక్తికి పరిధి దాటిపోయింది.
(ఓ జిలుగుపనితనాప్ల పూరేకా!)
ఎంతో స్వచ్ఛంగా, సుకుమారంగా,
యదార్థంగా సృష్టించబడ్డావు.
ఏ ఊహాతీతమైన
స్వర్లోకపు లోహంతో చెయ్యబడ్డావు?
ఎంత అమూల్యమైన దానివి?
నిన్నెవరు తీగలా సాగదీసారు, నిన్నెవరు
వెండి ఆవిరులతో రూపుదిద్దారు?
“నన్ను రూపుదిద్దినది ఆ భగవంతుడే.
ఊహాగానాలకి అతీతంగా
తనే నన్ను సాగదీసి, సొగసు వంకరలుపోయే
వెండి ఆవిరులనుండి
తన మనసు తనివి తీరేలా సృష్టించేడు.
ఇంత స్వచ్ఛంగా, అంత లీలగా,
అంత చిన్నగా, అంత యదార్థంగా,
అంత శక్తిమంతంగా, కోమలంగా,
వాయువనే సమ్మెటతో
మంచు పోగరతో,
నన్ను చెక్కి, మలిచేడు. “
.
ఫ్రాన్సిస్ థామ్సన్
(16 December 1859 – 13 November 1907)
ఇంగ్లీషు కవి.
.
Francis Thompson
.
To A Snow-Flake
.
What heart could have thought you ?—
Past our devisal
(O filigree petal! )
Fashioned so purely,
Fragilely, surely,
From what Paradisal
Imagineless metal
Too costly for cost?
Who hammered you, wrought you,
From argentine vapor? —
“God was my shaper.
Passing surmisal,
He hammered , He wrought me,
From curled silver vapor
To lust of his mind:-
Thou couldst not have thought me!
So purely, so palely,
Tinily, surely,
Mightily, frailly
Insculped and embossed
With his hammer of wind,
And his graver of frost.”
.
Francis Thompson
(16 December 1859 – 13 November 1907)
English Poet and Ascetic
Poem courtesy:
A home book of verse, American and English 1580-1918
Selected and Arranged by Burton Egbert Stevenson, Third Edition revised and enlarged, New York, 1918.