ఫిర్యాదు… మార్క్ అకెన్ సైడ్, ఇంగ్లీషు కవి దూరం! దూరం! మోసకారీ, ప్రేమా! నన్నిక మభ్యపెట్టకు: నీ మెత్తని మాటల ప్రభావానికి నా అమాయకపు యువహృదయం బలైంది, చివరికి ఎలాగైతేనేం నీ కుట్ర బహిర్గతమైంది కడకి ఖరీదైన అనుభవంతో జాగ్రత్త తెలిసొచ్చింది. దూరం! ఈ వయసులో నన్ను లొంగదీస్తాననుకోకు నాకు తెలుసు, ఆమె గొప్పదనాన్ని గ్రహించగలను. ఇప్పుడు ఇంకా చూపించాలా? ఆమె గురించి? నాకు? నాకు నాకే తెలియకుండా ఆ యువతి సొగసునీ, నమ్రతనీ, సుగుణాలనీ ప్రశంసించలేదు! ఎన్నిసార్లు అనలేదు ఆమె హృదయాన్ని తనదిగా చెప్పుగలగడం ఎంత ఆనందదాయకమో అని. కానీ, పొగడ్తల మారీ, సుఖన్నీ సంతృప్తినీ వృధాచేసేదానా, నీ ఆశ్రయంలో కష్టపడి నేర్చుకున్న జాగ్రత్త సుఖమివ్వగలదా? ఓ మోసకారీ, పోనీ ఎన్నడైనా నీ విజయాలలో అదృష్టాన్ని గెలుచుకోగలిగేవా? కనీసం, నీ మిత్రుల్ని ఆమె కఠినమైన నిర్ణయాలకి అతీతంగా ఉంచగలిగేవా? . మార్క్ అకెన్ సైడ్, (9 November 1721 – 23 June 1770) ఇంగ్లీషు కవి, వైద్యుడు . The Complaint . AWAY! away! Tempt me no more, insidious love: Thy soothing sway Long did my youthful bosom prove: At length thy treason is discern’d, At length some dear-bought caution earn’d: Away! nor hope my riper age to move. I know, I see Her merit. Needs it now be shown, Alas, to me? How often to myself unknown, The graceful, gentle, virtuous maid Have I admir’d! How often said, What joy to call a heart like hers one’s own! But, flattering God, O squanderer of content and ease, In thy abode Will care’s rude lesson learn to please? O say, deceiver, hast thou won Proud Fortune to attend thy throne, Or plac’d thy friends above her stern decrees? . Mark Akenside (9 November 1721 – 23 June 1770) English Poet and Physician The Book of Georgian Verse. 1909 Ed. William Stanley Braithwaite http://www.bartleby.com/333/43.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 2 వ్యాఖ్యలుజూన్ 16, 2014