అనువాదలహరి

ఒక ప్రస్థానం… రైనర్ మారియా రిల్కే, ఆస్ట్రియన్ కవి

నేను ప్రారంభించిన ఈ ప్రయాణంలో నా దారికి

ఎదురుగా అనంతదూరంలో సూర్యకిరణాలుసోకిన కొండ చూస్తున్నాను.

ఒకోసారి మనం అందుకోలేనిది మనల్ని అందుకుంటుంది;

దానిలో ఒక అంతర్గత కాంతి ఉంటుంది…అంత దూరం నుండి కూడా,

మనం అక్కడకి చేరుకోలేకపోయినా, మనల్ని ఉత్తేజపరచి

మనం  ఏమాత్రం గ్రహించలేకుండానే మనల్ని వేరే వ్యక్తులుగా

మార్చెస్తుంది;  మన చెయ్యూపుతూ చేసిన సంజ్ఞకి ప్రతిగా

మరొక సంజ్ఞ మనల్ని ముందుకి పురికొల్పుతుంది…

మనం తెలుసుకోగలిగింది మాత్రం ముఖాన్ని చిరుగాలి తాకుతూ పోవడం.

.

రైనర్ మారియా రిల్కే

(4 December 1875 – 29 December 1926)

ఆస్ట్రియన్ కవి
.

 

Rainer Maria Rilke

.

A Walk

.

My eyes already touch the sunny hill.

going far ahead of the road I have begun.

So we are grasped by what we cannot grasp;

it has inner light, even from a distance –

and charges us, even if we do not reach it,

into something else, which, hardly sensing it,

we already are; a gesture waves us on

answering our own wave…

but what we feel is the wind in our faces.

.

Rainer Maria Rilke

(4 December 1875 – 29 December 1926)

Bohemian-Austrian poet and novelist

Translated by Robert Bly

%d bloggers like this: