దురదృష్టం… జేమ్స్ ఏండర్సన్, స్కాట్లండు నిన్నరాత్రి ఒక మిత్రుడి శయ్య పక్కన కూర్చుని అలా పరికిస్తున్నాను బయటా లోపలా నిశ్శబ్దమే నెత్తిమీద గోడగడియారం చేసే చప్పుడు తప్ప నా ఆలోచనలు ముందుకీ ఊగిసలాడేయి అలా చాలా సమయం గడిచిపోయింది, “నా కంటే దురదృష్టవంతుడు ఉంటాడా?” అన్న సంశయం చివరకి నివృత్తి అయేదాకా. నా చెవులో ఒక మాట వినిపించింది… బాగా అలసి, నీరసించిన గొంతు అది… “నిస్సహాయులు” అని మూడుసార్లు అంది ఆ మాటలు నే వినడం తప్ప వద్దనగలిగేవి కావు. ఆ బాధితుడి ముఖాన్ని గమనించేను మాటాడే ప్రతి మాటవెనుక బాధని అర్థం చేసుకున్నాను నా లోని దెప్పిపొడిచే స్వభావం నిలదీసింది “నీకెప్పుడైనా అంత కష్టం కలిగిందా?” అని. ఆ ప్రశ్న నా హృదయాన్ని సూటిగా తాకింది… ఒక్కసారి నిస్సత్తువ ఆవహించింది…. నా పరిస్థితిని అతని పరిస్థితితో పోల్చుకుని ఊహించుకోలేకపోయాను అందులో నాకో గుణపాఠం కనిపించింది: మనం ఎప్పుడు మన కష్టాలే పెద్దవని మొరపెట్టుకోకూడదు మన కష్టాలు ఎంత గొప్పవైనప్పటికీ మనకంటే ఘోరమైన కష్టాలనుభవించేవారు ఉంటారు. . జేమ్స్ ఏండర్సన్ (1839 -1922) స్కాట్లండు Hard Luck . Last night I sat and watch’d Beside a comrade’s bed– An’ a’ was still, within an’ out, Save the watch-beat overhead; My thochts gaed back and fore, Frae now to “ould lang syne,”– Till a’ resolved to this at last, “Was ever luck like mine?” A voice then struck my ear– Sae weary an’ sae wae— In words I couldna choose but hear, And “helpless,” thrice did say; I mark’d the sufferer’s face, Read pain in ilka line– A taunting spirit in me asked, “Was ever luck like thine?” This touch’d me to the heart– I weaken’d richt awa– I couldna thole to see my case Compared wi’ his ava. And sae a lesson’s taught, That we should never tine— However hard your lot may be, There’s ithers waur than thine! . James Anderson (1839 -1922) Scottish Poet Poem Courtesy: http://rpo.library.utoronto.ca/poems/hard-luck-0 Notes “ould lang syne”: Robert Burns’s phrase, “long time gone by.” wae: woe(ful). ilka: each. thole: endure. ava: at all. tine: complain, moan. ithers waur: others worse. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిజూన్ 14, 2014